బాక్స్ ఆఫీస్ దగ్గర రెండేళ్ళ క్రితం పెద్దగా అంచనాలు లేకుండా రిలీజ్ అయ్యి అల్టిమేట్ విజయాన్ని నమోదు చేసిన సినిమా రాక్షసుడు, తమిళ్ లో సెన్సేషనల్ హిట్ గా నిలిచిన రాక్షసుడు సినిమాను తెలుగు లో అదే పేరు తో రీమేక్ చేయగా చాలా వరకు ఒరిజినల్ సీన్స్ ని అలానే ఉంచడం జరిగినా కానీ ఆడియన్స్ సినిమాను బాగా ఆదరించి సినిమా ని బాక్స్ ఆఫీస్ దగ్గర సూపర్ హిట్ అయ్యేలా చేశారు.
ఈ సినిమా తో బెల్లంకొండ శ్రీనివాస్ కెరీర్ లో మొట్ట మొదటి క్లీన్ హిట్ ని సొంతం చేసుకున్నాడు. ఈ సినిమా తెలుగు వర్షన్ ను డైరెక్ట్ చేసిన దర్శకుడు రమేష్ వర్మ రీసెంట్ గా సినిమా కి సీక్వెల్ ను అనౌన్స్ చేసిన విషయం అందరికీ తెలిసిందే.
అప్పటి నుండి సినిమా పై హైప్ సాలిడ్ గా పెరిగి పోగా ఇందులో ఓ స్టార్ మెయిన్ లీడ్ లో నటిస్తారు అంటూ చెప్పడం తో ఆ స్టార్ ఎవరు అవుతారు అన్నది ఆసక్తిగా మారగా టాలీవుడ్ లో కొందరి పేర్లు వినిపించినా కానీ ఎక్కువగా కోలివుడ్ స్టార్….
విజయ్ సేతుపతి పేరు వినిపిస్తూ ఉండగా త్వరలోనే దీని పై అఫీషియల్ అనౌన్స్ మెంట్ రాబోతుంది. ఇక ఇప్పుడు సినిమా బడ్జెట్ గురించిన న్యూస్ టాలీవుడ్ లో హాట్ టాపిక్ అయింది, ఈ సీక్వెల్ ని భారీ ఎత్తున బైలింగువల్ గా తెరకెక్కించ బోతున్నారని, బడ్జెట్ ఏకంగా 40 కోట్ల దాకా పెట్టబోతున్నారు అంటూ వార్తలు గట్టిగానే ప్రచారం లో ఉన్నాయి.
ఇది ఎంతవరకు నిజం అన్నది తెలియాల్సి ఉండగా ఈ రేంజ్ బడ్జెట్ అంటే మాత్రం సినిమా క్వాలిటీ కూడా అదిరిపోతుందని చెప్పొచ్చు. రాక్షసుడు ఒరిజినల్ 6 కోట్ల బడ్జెట్ లో రీమేక్ 10 కోట్ల బడ్జెట్ లో రూపొందగా సీక్వెల్ ఆల్ మోస్ట్ 3 రెట్లు అధికమైన బడ్జెట్ తో రూపొందుతూ ఉండటం విశేషం. మరి సినిమా ఎంతవరకు అంచనాలను తట్టుకుంటుందో చూడాలి.