కోట్లకు కోట్లు ఖర్చు చేసి తీసే సినిమాలు ఆడియన్స్ ముందుకు తీసుకు రావాలని, భారీగా బిజినెస్ లు జరగాలి అని, జనాలు ఆ సినిమాను ఆదరించాలని కోరుకొని వారు ఉండరు, కానీ అప్పుడప్పుడు రిలీజ్ కి ముందే కొన్ని సినిమాలు ఆన్ లైన్ లో లీక్ అవ్వడం లాంటివి మేకర్స్ ని ఓ రేంజ్ లో టెన్షన్ కి గురి అయ్యేలా చేస్తాయి. మన దగ్గర అత్తారింటికి దారేది లాంటి పెద్ద సినిమానే….
రిలీజ్ కి ముందు ఆన్ లైన్ లో లీక్ అయిన పరిస్థితులు ఉండగా బాలీవుడ్ లో మాత్రం సిస్టమాటిక్ గా ఉంటుంది అనుకుంటే అక్కడ కూడా అప్పుడప్పుడు ఇలాంటివి జరిగాయి. లేటెస్ట్ గా ఆడియన్స్ ముందుకు థియేటర్స్ లో కాకుండా డైరెక్ట్ గా డిజిటల్ లో రిలీజ్ కి సిద్దం అయిన…
కృతి సనన్ మెయిన్ లీడ్ లో నటించిన లేటెస్ట్ మూవీ మీమీ బాక్స్ ఆఫీస్ దగ్గర కాకుండా డైరెక్ట్ గా డిజిటల్ రిలీజ్ ను నెట్ ఫ్లిక్స్ లో 30 న కన్ఫాం చేసుకుంది. కానీ రిలీజ్ కి 5 రోజుల ముందే సినిమా మాస్టర్ ప్రింట్ ఆన్ లైక్ లో లీక్ అయ్యింది…..
టీం అందరూ తలలు పట్టుకు కూర్చున్నారు. ఎవరో ఎడిటింగ్ రూమ్ లో ఉన్న వాళ్ళు ఇలా సినిమా మొత్తాన్ని లీక్ చేశారని అంటున్నారు. ఈ సినిమా డిజిటల్ రిలీజ్ రైట్స్ ను నెట్ ఫ్లిక్స్ వాళ్ళు ఏకంగా 35 కోట్ల రేటు పెట్టి సొంతం చేసుకోగా సినిమా రిలీజ్ కి ఫుల్ పబ్లిసిటీ పనులలో ఉన్న టైం లో రిలీజ్ కి….
5 రోజుల ముందే సినిమా మొత్తం లీక్ అవ్వడంతో… చేసేదేమీ లేక హుటాహుటిన సినిమాను అదే రోజున నెట్ ఫ్లిక్స్ లో రిలీజ్ చేశారు… మంచి పబ్లిసిటీ తో సినిమాను రిలీజ్ చేయాలి అనుకున్నా సడెన్ గా జరిగిన పరిస్థితులతో సినిమా కి పబ్లిసిటీ ఖర్చుల ప్లేస్ లో మీడియా లో బాగానే పబ్లిసిటీ జరిగినా ఈ సినిమా ద్వారా మరింత పెయిడ్ సబ్ స్క్రిప్షన్స్ వస్తాయి అనుకుంటే ఆ విధంగా అయితే దెబ్బ పడింది అంటున్నారు ఇప్పుడు.