Home న్యూస్ అర్జున్ రెడ్డి ని వాళ్ళు చెడగొడితే….అసురన్ పరువు నిలిపిన నారప్ప!!

అర్జున్ రెడ్డి ని వాళ్ళు చెడగొడితే….అసురన్ పరువు నిలిపిన నారప్ప!!

0

ఒకప్పుడు రీమేక్ లు తీయడం అన్నది చాలా ఈజీగా ఉండేది… ఏ భాష వాళ్ళు ఆ భాష సినిమాలే చూసే వాళ్ళు.. ఇప్పటిలా అన్ని భాషల సినిమాలు అవలీలగా అందుబాటులో ఉండేవి కావు. దాంతో ఎక్కడ ఏ సినిమా బాగుంది అనిపిస్తే ఆ సినిమాను తమ భాషలో రీమేక్ చేసేవాళ్ళు. కానీ ఇప్పుడు అలా కాదు రీమేక్ అంటే కత్తి మీద సాము అని చెప్పాలి. ఒరిజినల్ ని చూసిన వాళ్ళు ఉంటారు…

కాబట్టి కంపారిజన్ లు కూడా ఉంటాయి, దాంతో ఎంతో శ్రద్ధతో ఒరిజినల్ ని చెడగొట్టకుండా రీమేక్ లను తెరకెక్కించాల్సి ఉంటుంది. ఇది టాలీవుడ్ మేకర్స్ కి ఇంకా కొంచం బెటర్ గా తెలుసు అనే చెప్పాలి. రీసెంట్ టైం లో ఒరిజినల్ వర్షన్ ని చెడగొట్టకుండా కొన్ని సార్లు బెటర్ గా తీసింది మనమే..

అయినా కానీ రీసెంట్ గా ఆడియన్స్ ముందుకు వచ్చిన వెంకటేష్ నారప్ప సినిమా విషయం లో చాలా కంపారిజన్ల వలన ఫ్యాన్ వార్స్ జరిగాయి. కానీ ఒరిజినల్స్ ని చెడగొట్టిన ఘనత కూడా వాళ్ళకే దక్కుతుంది ముందు. తెలుగు క్లాసిక్ అర్జున్ రెడ్డి సినిమాను…

తమిళ్ లో రెండు సార్లు రీమేక్ చేశారు. బాలా డైరెక్షన్ లో వచ్చిన వర్షన్ ఏమాత్రం బాలేదని అర్జున్ రెడ్డి అసిస్టంట్ డైరెక్టర్ ని పిలిపించి మళ్ళీ రీమేక్ చేయగా రెండు వర్షన్ లు కూడా ఒరిజినల్ తో పోల్చితే 10% కూడా ఇంపాక్ట్ చూపకుండా వరస్ట్ రీమేక్ లు అర్జున్ రెడ్డి పరువు తీశాయి. అదే టైం లో వెంకటేష్ నారప్ప సినిమా…

వెంకటేష్ ఏజ్ కి పెర్ఫెక్ట్ గా సెట్ అయిన రోల్ తో అసురన్ సినిమా రీమేక్ అయినా ఆ ఒరిజినల్ కి ఉన్న పేరు ఏమాత్రం చెడగొట్టకుండా పరువుని పెంచిన రీమేక్ అంటూ అక్కడ విశ్లేషకులు సినిమాకి కితాబు ఇస్తున్నారు. కొందరు కావాలని కంపారిజన్ లు చేస్తూ కామెంట్స్ చేస్తున్న ఎక్కువ మంది మాత్రం అసురన్ పరువు నిలిపిన రీమేక్ గా నారప్పని మెచ్చుకుంటున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here