చిన్న చిన్న సైడ్ రోల్స్ నుండి క్యారెక్టర్ రోల్స్ తర్వాత మెయిన్ హీరోగా ఎదిగి బాక్స్ ఆఫీస్ దగ్గర రన్ రాజా రన్, ఎక్స్ ప్రెస్ రాజా, శతమానం భవతి, మహానుభావుడు లాంటి హిట్స్ తో మీడియం రేంజ్ హీరోలలో ప్రామిసింగ్ హీరోగా ఎదిగిన శర్వానంద్ తర్వాత టైం లో బాక్స్ ఆఫీస్ దగ్గర ఎన్ని ప్రయత్నాలు చేసినా కానీ ఒక్కసారి కూడా ఆడియన్స్ ను బాక్స్ ఆఫీస్ దగ్గర అనుకున్న రేంజ్ లో మెప్పించలేదు…
వరుసగా పడి పడి లేచే మనసు, రణ రంగం, జాను మరియు శ్రీకారం సినిమాలు బాక్స్ ఆఫీస్ దగ్గర వరుస పెట్టి ఒకటి తర్వాత ఒకటి రిలీజ్ అయ్యి ఏమాత్రం ఆకట్టుకోలేక పోగా అన్ని కూడా ఫ్లాఫ్స్ గా నిలిచాయి. ఇప్పుడు ఈ లిస్టులో 5 వ సినిమాగా…
ఆడియన్స్ ముందుకు రీసెంట్ గా మహా సముద్రం సినిమా కూడా జాయిన్ అయింది. ఈ సినిమా కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర డిసాస్టర్ రిజల్ట్ ను సొంతం చేసుకుంది… కెరీర్ లో ఒడిదుడుకులను ఎదురుకున్నా ఒక దశలో ఏడాది లో 100 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్స్ ని మూడు సినిమాలతో…
సొంతం చేసుకున్న శర్వానంద్ నిర్మాతలకు ఫుల్ ప్రామిసింగ్ లా అనిపించాడు, 2017 ఇయర్ లో శతమానం భవతి 56 కోట్ల గ్రాస్ ను, తర్వాత రాధ సినిమా 16 కోట్ల గ్రాస్ ను అందుకోగా మహానుభావుడు సినిమా 36 కోట్ల గ్రాస్ ను అందుకుని ఆ ఇయర్ లో టోటల్ గా 108 కోట్ల గ్రాస్ ను 64.63 కోట్ల షేర్ ని సొంతం చేసుకుని కెరీర్ బెస్ట్ ఇయర్ ని సొంతం చేసుకున్నాడు.
కానీ తర్వాతే చేసిన సినిమా చేసినట్లు బాక్స్ ఆఫీస్ దగ్గర తీవ్రంగా నిరాశ పరుస్తూ ఇప్పుడు మళ్ళీ కెరీర్ మొదటికి చేరేలా చేసింది. ఇక ఇప్పుడు శర్వానంద్ తన ఆశలన్నీ కూడా రష్మికతో కలిసి చేస్తున్న ఆడవాళ్ళు మీకు జోహార్లు సినిమా పైనే పెట్టుకున్నాడు. మరి ఆ సినిమా తో అయినా శర్వా మంచి కంబ్యాక్ ను బాక్స్ ఆఫీస్ దగ్గర సొంతం చేసుకోవాలని కోరుకుందాం.