Home న్యూస్ 200 లో….80 కావాలి….ఏమవుతుందో ఇక…కురుప్ తెలుగు లెక్క ఇదే!

200 లో….80 కావాలి….ఏమవుతుందో ఇక…కురుప్ తెలుగు లెక్క ఇదే!

0

మలయాళ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ బాక్స్ ఆఫీస్ దగ్గర తెలుగు లో మహానటి సినిమాతో మెప్పించగా లాస్ట్ ఇయర్ కనులు కనులను దోచాయంటే సినిమా తో సైలెంట్ గా వచ్చి మంచి విజయాన్ని సొంతం చేసుకున్నాడు. ఆ సినిమా తర్వాత టెలివిజన్ లో కూడా సూపర్ డూపర్ హిట్ అయ్యి సాలిడ్ రేటింగ్ లను సొంతం చేసుకుంది. ఈ సినిమా తర్వాత ఇప్పుడు ఆడియన్స్ ముందుకు దుల్కర్ సల్మాన్ నటిస్తున్న…

కొత్త సినిమా కురుప్ 12 న సౌత్ భాషలు అన్నింటిలో డబ్ అయ్యి రిలీజ్ కాబోతుంది, సినిమా తెలుగు విషయానికి వస్తే ప్రజెంట్ అయితే పెద్దగా బజ్ లేదు కానీ రిలీజ్ అయ్యాక టాక్ బాగుంటే సినిమా బాగా పెర్ఫార్మ్ చేసే అవకాశం ఎంతైనా ఉందని చెప్పాలి.

ఇక సినిమా తెలుగు రాష్ట్రాలలో మొత్తం మీద రిలీజ్ అవుతున్న థియేటర్స్ కౌంట్ ని గమనిస్తే… నైజాంలో 65 థియేటర్స్ లో సీడెడ్ లో 30 థియేటర్స్ లో ఆంధ్రలో 100 వరకు థియేటర్స్ లో రిలీజ్ కాబోతున్న ఈ సినిమా టోటల్ గా తెలుగు రాష్ట్రలాలో 200 వరకు థియేటర్స్ లో గ్రాండ్ రిలీజ్ నే ఇప్పుడు సొంతం చేసుకోబోతుంది.

ఇక సినిమా ఓవరాల్ గా తెలుగు లో సాధించిన బిజినెస్ పెర్ఫెక్ట్ కౌంట్ ఏమి రిలీజ్ అవ్వలేదు కానీ ట్రేడ్ లో వినిపిస్తున్న లెక్కల ప్రకారం సినిమా తెలుగు బిజినెస్ 60 లక్షల రేంజ్ లో ఉందని అంటున్నారు. ఆ లెక్కన సినిమా ఇప్పుడు తెలుగు లో క్లీన్ హిట్ అవ్వాలి అంటే మినిమమ్ 80 లక్షల రేంజ్ లో కలెక్షన్స్ ని సొంతం చేసుకోవాల్సిన అవసరం ఉంది.

మొత్తం మీద సినిమా 200 థియేటర్స్ లో 80 లక్షల టార్గెట్ తో తెలుగులో బరిలోకి దిగుతుండగా పాజిటివ్ టాక్ కనుక సొంతం అయితే కలెక్షన్స్ పరంగా లాంగ్ రన్ లో హోల్డ్ చేసే అవకాశం ఉందని చెప్పాలి. ఇక అన్ని వర్షన్స్ కలిపి వరల్డ్ వైడ్ గా 1500 వరకు స్క్రీన్స్ లో ఈ సినిమా రిలీజ్ కాబోతుందట. మరి రిజల్ట్ ఎలా ఉంటుందో చూడాలి ఇక.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here