కెరీర్ తొలినాళ్ళలో ప్రేమ కావాలి, లవ్ లీ లాంటి హిట్స్ ని సొంతం చేసుకున్న తర్వాత అసలు హిట్ అంటే తెలియకుండా కెరీర్ ని కొనసాగిస్తున్న హీరో ఆది సాయి కుమార్ కి సినిమా ఆఫర్స్ అయితే వస్తున్నాయి కానీ అవి ఏవి కూడా ఆడియన్స్ ను అలరించలేకపోతున్నాయి. ఇక ఇప్పుడు ఆడియన్స్ ముందుకు అతిథి దేవోభవ అంటూ మరో ప్రయత్నం చేసిన ఆది సక్సెస్ అయ్యాడా లేదా తెలుసు కుందాం పదండీ…
కథ పాయింట్ కి వస్తే…. ఇంట్లో ఒక్కడు ఉంటే ఆ ఒంటరితనాన్ని తట్టుకోలేక ఆత్మహత్యకి ట్రై చేసే వ్యాధి(మోనో ఫోబియా) ఉన్న హీరో కి ముందు ఒక లవ్ స్టొరీ ఉంటుంది కానీ హీరో గురించి ఆ అమ్మాయికి నిజం తెలియడంతో లవ్ ఫేల్యూర్ అవ్వగా తర్వాత హీరోయిన్ ని చూసి ఇష్టపడతాడు కానీ…
ఈ సారి వ్యాధి గురించి హీరోయిన్ కి చెప్పడు, మరి వీళ్ళ లవ్ స్టొరీ సక్సెస్ అయిందా లేదా అన్నది సినిమా కథ… ఓవరాల్ గా స్టొరీ పాయింట్ వినూత్నంగా అనిపించినా కానీ ఫస్టాఫ్ మొత్తం అటు కామెడీ కరెక్ట్ గా పండకా ఇటు థ్రిల్ కూడా సరిగ్గా కుదరక…
ఇటు సెకెండ్ ఆఫ్ సైకో థ్రిల్లర్ జానర్ లా ట్రై చేసి అసలు ఏ జానర్ కి కూడా సినిమా న్యాయం చేయలేక పోయింది, ఉన్నంతలో ఆది పర్వాలేదు అనిపించినా మ్యూజిక్ బాగా ఆకట్టుకున్నా కానీ డైరెక్షన్ చాలా వీక్ గా ఉండటంతో డిఫెరెంట్ కాన్సెప్ట్ కాస్తా కిచిడీలా మారి ఏ దశలో కూడా ఆడియన్స్ ను ఇంప్రెస్ చేయలేక పోయింది. ఉన్నంతలో పాటలు బాగుండటం ఒక్కటే…
సినిమాకి ఎంతో కొంత కలిసి వచ్చింది అని చెప్పాలి. ఆది తన వంతుగా మరో మంచి ప్రయత్నం చేసినా కానీ డైరెక్షన్స్ వీక్ గా ఉండటంతో మరోసారి నిరాశ తప్పలేదు… ఓవరాల్ గా పాటల కోసం అక్కడక్కడా కొన్ని థ్రిల్ కలిగించే సీన్స్ కి తప్పితే అతిథి దేవోభవ ఏమాత్రం ఇంప్రెస్ చేయలేక పోయింది. సినిమా కి మా రేటింగ్ 2 స్టార్స్..