బాక్స్ ఆఫీస్ దగ్గర ఫామ్ ని ఎప్పుడో కోల్పోయిన హీరోలలో ఆది సాయి కుమార్ ఒకరు అని చెప్పాలి. బాక్స్ ఆఫీస్ దగ్గర కెరీర్ మొదట్లో చేసిన తొలి 2 సినిమాలతో మంచి సక్సెస్ లను సొంతం చేసుకున్నప్పటికీ కూడా తర్వాత పరిస్థితులు ఆదికి అస్సలు కలిసి రాలేదు అని చెప్పాలి. బాక్స్ ఆఫీస్ దగ్గర చేసిన సినిమా చేసినట్లు ఫ్లాఫ్ అవ్వడం తో కెరీర్ లో చాలా డౌన్ ఫాల్ లోకి…
వెళ్ళిపోయిన ఆది సాయి కుమార్ సినిమా అవకాశాలు అయితే సొంతం అవుతున్నాయి కానీ అవి బాక్స్ ఆఫీస్ దగ్గర సక్సెస్ లుగా అయితే మట్టుకు నిలవడం లేదు అని చెప్పాలి. ఇప్పుడు రీసెంట్ గా ఆది సాయి కుమార్ నటించిన లేటెస్ట్ మూవీ అతిథి దేవోభవ ఆడియన్స్ ముందుకు….
ఆర్ ఆర్ ఆర్ సినిమా పోస్ట్ పోన్ అయిన రోజున రిలీజ్ అవ్వగా తొలి ఆటకే డిసాస్టర్ టాక్ ని సొంతం చేసుకున్న ఈ సినిమా ఏ దశలో కూడా ఆడియన్స్ ను థియేటర్స్ కి రప్పించ లేక పోయింది. దాంతో మరోసారి ఆది కి నిరాశ పరిచే రిజల్ట్ సొంతం అయ్యింది…
ఇక సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర మొదటి వీకెండ్ మొత్తం డెఫిసిట్ లు నెగటివ్ షేర్స్ తో పరుగును కొనసాగించింది, అవి తీసేస్తే సినిమా షేర్ జీరో అని చెప్పొచ్చు. అవి తీయకుండా చెప్పాలి అంటే ఫస్ట్ డే 3 లక్షలు, రెండో రోజు 2 లక్షలు, మూడో రోజు 2 లక్షలు, మొత్తం మీద 3 రోజుల్లో బాక్స్ ఆఫీస్ దగ్గర 7 లక్షల షేర్ ని, 14 లక్షల దాకా…
గ్రాస్ కలెక్షన్స్ ని సినిమా సొంతం చేసుకుంది. డెఫిసిట్ లు నెగటివ్ షేర్స్ తీసేస్తే జీరో షేర్ వచ్చింది అని చెప్పాలి. బాక్స్ ఆఫీస్ దగ్గర ఆల్ రెడీ 3rd వేవ్ ఇంపాక్ట్ కనిపిస్తుంది, దానికి తోడూ కొత్త సినిమాలు ఇలాంటి ప్రదర్శన చూపెట్టడం బాధాకరం. ఇక వర్కింగ్ డేస్ లో ఈ సినిమా ఎలాంటి ప్రదర్శనని చూపెడుతుందో చూడాలి.