బాక్స్ ఆఫీస్ దగ్గర మెగా అల్లుడు కళ్యాణ్ దేవ్ నటించిన లేటెస్ట్ మూవీ సూపర్ మచ్చి రీసెంట్ గా ఆడియన్స్ ముందుకు రాగా, ఎలాంటి ప్రమోషన్స్ లాంటివి లేకుండా చాలా సైలెంట్ గా రిలీజ్ అయిన ఈ సినిమా కి ఆక్యుపెన్సీ కానీ జనాలు కానీ బాక్స్ ఆఫీస్ దగ్గర చాలా తక్కువగానే లభించింది అని చెప్పాలి. రెండు తెలుగు రాష్ట్రాలలో మార్నింగ్ అండ్ మ్యాట్నీ షోలకే భారీగా డెఫిసిట్ లు పడగా…
మొత్తం మీద కొన్ని చోట్ల సినిమా అతి తక్కువ ఆక్యుపెన్సీ వలన థియేటర్స్ నుండి తొలగించాల్సి వచ్చింది, దాంతో డెఫిసిట్ లు నెగటివ్ షేర్స్ ని సొంతం చేసుకోగా, అవి తీసేస్తే సినిమా మొదటి రోజు ఎలాంటి కలెక్షన్స్ ని సొంతం చేసుకోలేదు అని చెప్పొచ్చు.
కానీ మొత్తం మీద నెగటివ్ షేర్స్, డెఫిసిట్ లు తీయకుండా చెప్పాలి అంటే మొదటి రోజు సినిమా 5 లక్షల దాకా షేర్ ని 10 లక్షల దాకా గ్రాస్ ను సొంతం చేసుకుంది. కానీ పండగ టైం లో ఇంత తక్కువ షేర్ ని కొత్త సినిమా సొంతం చేసుకోవడం విచారకరం… ఇక మిగిలిన పండగ హాలిడేస్ లో సినిమా ఏమైనా కలెక్షన్స్ ని సాధిస్తుందో లేదో చూడాలి.