Home న్యూస్ సాలిడ్ OTT రేటుకి నో అన్నారు…ఇప్పుడు ఈ కలెక్షన్స్ ఏంటి సామి!!

సాలిడ్ OTT రేటుకి నో అన్నారు…ఇప్పుడు ఈ కలెక్షన్స్ ఏంటి సామి!!

0

మెగా అల్లుడు కళ్యాణ్ దేవ్ హీరోగా విజేత సినిమా తర్వాత చేసిన సినిమా సూపర్ మచ్చి, కన్నడ స్టార్ హీరోయిన్ రచితా రామ్ హీరోయిన్ గా చేసిన ఈ సినిమా ఆడియన్స్ ముందుకు ఎప్పుడో రావాల్సింది కానీ ఎప్పటికప్పుడు అనేక కారణాల వలన సినిమా రిలీజ్ పోస్ట్ పోన్ అవుతూ రాగా ఆడియన్స్ ముందుకు ఇక సినిమా రాదేమో అనుకుంటున్న టైం లో సినిమా డిజిటల్ రిలీజ్ కి గాను ఉన్నంతలో…

మంచి మంచి ఆఫర్స్ వచ్చాయి అన్న టాక్ లాస్ట్ ఇయర్ తెగ వినిపించింది. సినిమా డిజిటల్ రిలీజ్ కూడా కాబోతుంది అంటూ వార్తలు రాగా డిజిటల్ రిలీజ్ కోసం సినిమా కి ఏకంగా 4.5 కోట్ల నుండి 5 కోట్ల రేంజ్ దాకా కూడా ఆఫర్స్ వచ్చాయి అని ట్రేడ్ లో వార్తలు వినిపించినా…

ఎందుకనో ఈ ఆఫర్స్ కి మేకర్స్ నో చెప్పి సినిమాను థియేటర్స్ లోనే రిలీజ్ చేయాలనీ డిసైడ్ అయ్యి సంక్రాంతి రేసులో పెద్ద సినిమాలు అన్నీ పోస్ట్ పోన్ అయ్యాక సడెన్ గా ఈ సినిమా రిలీజ్ డేట్ ని ప్రకటించారు కానీ అసలు ఏమాత్రం ప్రమోషన్స్ లాంటివి జరగక పోవడం…

మెగా హీరోలు ఎవరూ కూడా అసలు ఈ సినిమాను పట్టించుకోక పోవడంతో సినిమా కి నాసికరం థియేటర్స్ దక్కాయి. మొత్తం మీద సినిమా మొదటి రోజే కలెక్షన్స్ లేక పోవడం తో చాలా థియేటర్స్ నుండి తొలగించాల్సిన పరిస్థితి కూడా ఎదురు అవ్వగా మొదటి రోజు 5 లక్షల షేర్ ని అందుకున్న సినిమా మొత్తం మీద ఇప్పటి వరకు తెలుగు రాష్ట్రాలలో చూసుకుంటే…

15 లక్షల రేంజ్ లో షేర్ ని 28 లక్షల రేంజ్ లో గ్రాస్ కలెక్షన్స్ ని సొంతం చేసుకుంది, ఈ కలెక్షన్స్ కూడా డెఫిసిట్ లు నెగటివ్ షేర్స్ తీయకుండా చెబుతున్న కలెక్షన్స్ కాగా అవి కూడా తీసేస్తే ఇక మిగిలేది ఏమి ఉండదు అని చెప్పాలి. OTT కి ట్రై చేసి ఉన్నా సినిమా కి ఉన్నంతలో మంచి ప్రాఫిట్స్ ని సినిమా సొంతం చేసుకునేది కానీ ఇప్పుడు పరిస్థితి ఇలా అయిపోవడం విచారకరం అనే చెప్పాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here