Home న్యూస్ సూపర్ మచ్చి రివ్యూ….ఏంటి సామి ఇది!!

సూపర్ మచ్చి రివ్యూ….ఏంటి సామి ఇది!!

0

మెగా అల్లుడు కళ్యాణ్ దేవ్ టాలీవుడ్ లో విజేత సినిమాతో అడుగు పెట్టినా ఆకట్టుకోలేక పోయాడు, రెండో ప్రయత్నంగా సూపర్ మచ్చి అనే సినిమాను ఎప్పుడో మొదలు పెట్టగా ఎప్పుడో పూర్తీ అయినా కానీ ఆడియన్స్ ముందుకు రావడానికి చాలా టైం పట్టిన ఈ సినిమా ఎట్టకేలకు సంక్రాంతి రేసులో పోటి తక్కువగా ఉన్న టైం లో పెద్దగా ప్రమోషన్స్ లాంటివి లేకుండా సైలెంట్ గా రిలీజ్ ను సొంతం చేసుకుంది.

మరి సినిమా ఎలా ఉంది ఎంతవరకు ఆకట్టుకుందో వివరాల్లోకి వెళితే… ముందుగా కథ పాయింట్ కి వస్తే సాఫ్ట్ వేర్ అయిన హీరోయిన్ నార్మల్ జాబ్ చేస్తూ ఫ్రెండ్స్ తో ఎంజాయ్ చేసే హీరోని ముఖం కూడా చూడకుండా ప్రేమిస్తుంది, తర్వాత అతనిగురించి తెలిసిన తర్వాత కూడా ప్రేమ అంటూ వెంట పడుతుంది, ప్రేమకి దూరంగా ఉంటూ వస్తాడు హీరో….

మరి వీళ్ళ ప్రేమ కథ సఫలం అయ్యిందా లేదా అనేది మొత్తం మీద సినిమా కథ పాయింట్… అతి సాధారణమైన స్టొరీ పాయింట్ తో వచ్చిన సూపర్ మచ్చి ఏ దశలో కూడా ఆడియన్స్ ని అలరించలేకపోయింది అని చెప్పాలి. ఉన్నంతలో కళ్యాణ్ దేవ్ కొంచం బెటర్ యాక్టింగ్ ను…

మొదటి సినిమాతో కంపేర్ చేస్తే చేయగా హీరోయిన్ రచితా రామ్ కూడా ఆకట్టుకుంది. ఇతర రోల్స్ అన్నీ కూడా పర్వాలేదు అనిపించగా ఎడిటింగ్, స్క్రీన్ ప్లే, కథ, డైరెక్షన్ ఇలా సినిమా కి అనేక మైనస్ పాయింట్స్ ఉన్నాయి.. ఎప్పుడో అరిగిపోయి పక్కకు పెట్టేసిన స్టొరీ పాయింట్ ని తీసుకుని ఆల్ మోస్ట్ 2న్నర గంటల సినిమాతో ఆడియన్స్ పేషన్స్ కి పరీక్ష పెట్టారు…

ఉన్నంతలో తమన్ పాటలు పర్వాలేదు అనిపించడం ఒకటి రెండు సీన్స్ మెప్పించడం లాంటివి మాత్రమే ఎంతో కొంత భరించేలా చేశాయి అని చెప్పాలి. సంక్రాంతికి అన్ని సినిమాలు చూసిన తర్వాత బోర్ కొడితే ఈ సినిమా అతి కష్టం మీద ఒకసారి చూడొచ్చు. లేదంటే OTT లో ఏదైనా బెటర్ ఆప్షన్ ని వెతుక్కోవడం మేలు అని చెప్పొచ్చు. సినిమా కి మా ఫైనల్ రేటింగ్ 1.75 స్టార్స్…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here