బాక్స్ ఆఫీస్ దగ్గర 2021 ఇయర్ లో కొన్ని సినిమాలు భారీ బడ్జెట్ తో తెరకెక్కి ఆడియన్స్ ముందుకు రాగా వాటిలో కొన్ని సినిమాలు మాత్రమే ఆడియన్స్ అంచనాలను అందుకోగలిగాయి, వాటిలో కూడా కొన్ని మాత్రమే పెట్టిన బడ్జెట్ కి న్యాయం చేసేలా బిజినెస్ ను రికవరీ చేశాయి. చాలా వరకు సినిమాలు బాక్స్ ఆఫీస్ దగ్గర నిరాశ పరిచినవే ఉండగా అలాంటి వాటిలో భారీ గా నిరాశ పరిచి డిసాస్టర్ రిజల్ట్ ను…
సొంతం చేసుకున్న సినిమాగా రానా దగ్గుబాటి నటించిన అరణ్య సినిమాని చెప్పుకోవాలి. సినిమా పై పెద్దగా బజ్ ఏమి లేకున్నా కానీ ఎరోస్ వాళ్ళు ఈ సినిమా ఏకంగా 60 కోట్ల రేంజ్ బడ్జెట్ తో భారీగా రూపొందించగా పాన్ ఇండియా లెవల్ లో భారీగా రిలీజ్ చేయాలనీ…
చూసినా కానీ కరోనా దెబ్బకి అది సెట్ అవ్వక పోవడంతో సినిమా సౌత్ భాషల్లోనే రిలీజ్ అయ్యి అంచనాలను అందుకోలేక డిసాస్టర్ రిజల్ట్ ను సొంతం చేసుకుని తీవ్రంగా నిరాశ పరిచింది. ఈ దెబ్బకి హిందీలో సినిమా రిలీజ్ కూడా నోచుకోలేక పోయింది… ఇలాంటి సినిమా డిజిటల్ అండ్ శాటిలైట్ రైట్స్…
హక్కులను సొంతం చేసుకున్న జీ నెట్ వర్క్ వాళ్ళు సినిమాను తెలుగులో రీసెంట్ గా టెలికాస్ట్ చేయగా సినిమా కి ప్రమోషన్స్ అయితే ఓ రేంజ్ లో చేశారు… సినిమా పై ఆడియన్స్ లో బజ్ క్రియేట్ చేయడానికి ట్రై చేశారు కానీ సినిమాను పండగ టైం లో కాకుండా నార్మల్ వీకెండ్ లో టెలికాస్ట్ చేయగా మొత్తం మీద ఫస్ట్ టైం టెలికాస్ట్ అయినప్పుడు…
ఈ సినిమా కి 5.07 TRP రేటింగ్ మాత్రమే సొంతం అయినట్లు సమాచారం. సినిమా బడ్జెట్ దృశ్యా చూస్తే ఇది మైండ్ బ్లాంక్ అయ్యే రేటింగ్ అనే చెప్పాలి. కొన్ని చిన్నా చితకా డబ్బింగ్ మూవీస్ కి అప్పుడప్పుడు రేటింగ్ ఇంకా బెటర్ గా వచ్చేది, కానీ పిల్లలు ఇష్టపడే చాన్స్ ఉన్న అరణ్య కి మరీ తక్కువ రేటింగ్ దక్కింది అనే చెప్పాలి. బాక్స్ ఆఫీస్ రిజల్ట్ దృశ్యా కూడా చూస్తే ఇంతకంటే ఎక్కువ ఆశించడం కూడా తప్పే అవుతుంది అనే చెప్పాలి.