కెరీర్ ని ఎలా మొదలు పెట్టాం అన్నది ముఖ్యం కాదు, ఎలా ప్లాన్ చేసుకుని ఒక స్టేబుల్ మార్కెట్ ను సొంతం చేసుకోవడం చాలా ముఖ్యం, బాక్స్ ఆఫీస్ దగ్గర కెరీర్ మొదలు పెట్టిన మొదటి సినిమాకే హిట్ కొట్టి తర్వాత రెండో సినిమా కి సూపర్ హిట్ ని సొంతం చేసుకున్న తర్వాత వరుస పెట్టి వచ్చిన ఆఫర్స్ అన్నింటినీ ఓకే చేసేసరికి వాటి రిజల్ట్ లు తేడా కొట్టడం తో….
బాక్స్ ఆఫీస్ రీసెంట్ మూవీస్ తో మినిమమ్ బజ్ ని కూడా క్రియేట్ చేయకుండా హిట్ కొట్టి ఏకంగా 10 ఏళ్ళు అవుతున్నా కానీ ఇప్పటికీ హిట్ కోసం ఎదురు చూస్తున్న సాయి కుమార్ తనయుడు ఆది సాయికుమార్ నటించిన లేటెస్ట్ మూవీ అతిధి దేవోభవ ఆడియన్స్ ముందుకు….
సంక్రాంతి రేసు లో సినిమాలు తప్పుకోవడంతో వాటి కన్నా ఒక్క వారం ముందు ఆడియన్స్ ముందుకు రాగా అసలు జనాలు ఈ సినిమాను పట్టించుకోనే లేదు అని చెప్పాలి. సినిమా టాక్ కూడా డిసాస్టర్ అనిపించే విధంగా సొంతం అవ్వడంతో అసలు ఏ దశలో కూడా సినిమా ఆడియన్స్ ను మెప్పించలేక పోయింది…
పాటలు పర్వాలేదు అనిపించే విధంగా ఉన్నప్పటికీ జనాలు ఆదిని నమ్మి థియేటర్స్ రాలేక పోయారు. దాంతో సినిమా టోటల్ రన్ లో 9 లక్షల షేర్ ని 17 లక్షల గ్రాస్ ను సొంతం చేసుకోగా అందులో డెఫిసిట్ లు నెగటివ్ షేర్స్ ని తీసేస్తే మొత్తం మీద సినిమా షేర్ జీరో అవుతుందని ట్రేడ్ వర్గాలు చెబుతూ ఉండటం విచారకరం అనే చెప్పాలి…
10 ఏళ్ళుగా హిట్ కోసం ఎదురు చూస్తున్న ఆది ఈ సినిమా తో అయినా పర్వాలేదు అనిపించుకుంటాడు అనుకుంటే మరోసారి నిరాశే ఎదురు అయింది అని చెప్పాలి. మరి అప్ కమింగ్ మూవీస్ లో ఏ సినిమా తో ఆది సాయి కుమార్ తిరిగి ఆడియన్స్ ను థియేటర్స్ రప్పించి మెప్పించగలుగుతాడో లేదో చూడాలి..