బాక్స్ ఆఫీస్ దగ్గర కీర్తి సురేష్ నటించిన లేటెస్ట్ మూవీ గుడ్ లక్ సఖి ఎప్పుడో రిలీజ్ అవ్వాల్సింది కానీ లేట్ అవుతూ లేట్ అవుతూ ఎట్టకేలకు ఆడియన్స్ ముందుకు రీసెంట్ గా రిలీజ్ అవ్వగా సినిమా తెలుగు రాష్ట్రాలలో ఆల్ మోస్ట్ 300 లోపు థియేటర్స్ లో రిలీజ్ అయింది, కానీ సినిమా చూసిన ఆడియన్స్ నుండి సినిమాకి కంప్లీట్ గా నెగటివ్ టాక్ స్ప్రెడ్ అవ్వగా ఆ ఇంపాక్ట్….
బాక్స్ ఆఫీస్ దగ్గర కూడా సాలిడ్ గా కనిపించింది. దాంతో ఏ దశలో కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర ఆకట్టుకోలేక పోయిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర వీకెండ్ లోనే చేతులు ఎత్తేయగా వర్కింగ్ డేస్ లో థియేటర్స్ లో జనాలు లేక షోలు ఆగిపోవడం, వేరే సినిమాలను వేయడం లాంటివి…
జరగగా ఇప్పుడు మొత్తం మీద మొదటి వారం పూర్తీ అయ్యే టైం కి 95% థియేటర్స్ నుండి ఈ సినిమాను తొలగించేశారు… దాంతో వారం కూడా సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర పరుగును కొనసాగించలేక పరుగును ముగించేసింది అని చెప్పాలి. బాక్స్ ఆఫీస్ దగ్గర సినిమా భారీ డిసాస్టర్ గా నిలిచింది అని చెప్పాలి.