యాక్షన్ హీరో విశాల్ నటించిన లేటెస్ట్ మూవీ సామాన్యుడు బాక్స్ ఆఫీస్ దగ్గర రీసెంట్ గా రిలీజ్ అవ్వగా సినిమా కి ఆడియన్స్ నుండి పర్వాలేదు అనిపించేలా రెస్పాన్స్ అయితే వచ్చింది కానీ జనాలు అన్ సీజన్ ఎఫెక్ట్ వలన థియేటర్స్ కి భారీ లెవల్ లో వెళ్ళడానికి పెద్దగా ఆసక్తి అయితే చూపడం లేదు అని చెప్పాలి. ఆ ఇంపాక్ట్ వలన అలాగే సినిమా కి మరీ టాక్ పాజిటివ్ గా…
లేక పోవడం కూడా ఒక కారణం అవ్వడంతో ఓపెనింగ్స్ పరంగానే సామాన్యుడు సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర తీవ్రంగా నిరాశ పరిచే ఓపెనింగ్స్ ను సొంతం చేసుకుంది అని చెప్పాలి. తొలిరోజు బ్రేక్ ఈవెన్ టార్గెట్ దృశ్యా మినిమమ్ 1 కోటికి పైగా ఓపెనింగ్స్ ను అందుకోవాల్సింది కానీ…
సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర కేవలం 40 లక్షల రేంజ్ షేర్ తోనే సరిపెట్టుకుంది. ఇక రెండో రోజు లో అడుగు పెట్టిన ఈ సినిమా సాలిడ్ గా హోల్డ్ చేయాల్సిన అవసరం ఉన్నప్పటికీ కూడా మొదటి రోజు తో పోల్చితే బాక్స్ ఆఫీస్ దగ్గర డ్రాప్స్ గట్టిగానే కనిపిస్తూ ఉన్నాయి అని చెప్పాలి.
సినిమా మొత్తం మీద మొదటి రోజు తో పోల్చితే రెండో రోజు 30% వరకు డ్రాప్స్ ను సొంతం చేసుకోగా ఈవినింగ్ అండ్ నైట్ షోలలో కొద్ది వరకు గ్రోత్ కనిపించినా కానీ అది అనుకున్న రేంజ్ లో అయితే లేదనే చెప్పాలి. మొత్తం మీద ఇప్పుడు సెకెండ్ డే లో సినిమా 25 లక్షల రేంజ్ లో కలెక్షన్స్ ని అందుకునేలా కనిపిస్తూ ఉండగా అన్ని చోట్లా….
ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ లెక్కలు బాగుంటే 28 నుండి 30 లక్షల రేంజ్ ఓపెనింగ్స్ ని అందుకునే అవకాశం కనిపిస్తూ ఉంది, కానీ బ్రేక్ ఈవెన్ ని అందుకోవాలి అంటే ఇది అసలు ఏమాత్రం సరిపోదు అనే చెప్పాలి…. దాంతో గట్టి ఎదురుదెబ్బ తగిలిన సామాన్యుడు బాక్స్ ఆఫీస్ దగ్గర ఏదైనా అద్బుతం జరిగితే తప్ప ఇప్పుడు సేఫ్ అయ్యేలా అయితే కనిపించడం లేదు…