అడివి శేష్ నటించిన లేటెస్ట్ మూవీ మేజర్ బాక్స్ ఆఫీస్ దగ్గర రీసెంట్ గా రిలీజ్ అవ్వగా సినిమా అన్ని చోట్లా ఎక్స్ లెంట్ కలెక్షన్స్ ని సొంతం చేసుకున్నప్పటికీ కూడా ఒక చోట మాత్రం అంచనాలను అందుకుంటే బాక్స్ ఆఫీస్ రచ్చ మరో లెవల్ లో ఉంటుంది అని అందరూ అంచనా వేయగా అక్కడ సినిమా మాత్రం ఓవరాల్ గా నిరాశ పరిచే కలెక్షన్స్ ని సాధించి నిరాశ పరిచింది అని చెప్పాలి.
ఆ ఏరియానే హిందీ… అక్కడ సినిమా కి బాగా ప్రమోషన్స్ చేశారు, చాలా సెంటర్స్ పెయిడ్ ప్రీమియర్స్ ని వేయగా అక్కడ నుండి రెస్పాన్స్ ఎక్స్ లెంట్ గా ఉండగా రిలీజ్ అయిన తర్వాత పాజిటివ్ టాక్ ని సొంతం చేసుకోవడంతో ఇక సినిమాకి అక్కడ తిరుగు లేదని అనుకున్నా కానీ….
మొత్తం మీద 6 రోజుల్లో 7 కోట్ల రేంజ్ లోనే నెట్ కలెక్షన్స్ ని సొంతం చేసుకుని నిరాశ పరిచింది. పాజిటివ్ టాక్ ఉన్నప్పటికీ సినిమా భారీగా అండర్ పెర్ఫార్మ్ చేసి హిందీలో ఏమాత్రం అంచనాలను అందుకోలేదు…. అక్కడ నిరాశ పరిచినా కానీ ఓవరాల్ గా అన్ని కలిపి సినిమా ఎక్స్ లెంట్ కలెక్షన్స్ తో సూపర్ డూపర్ హిట్ గా నిలిచింది.