Home న్యూస్ 40 కోట్ల బింబిసార టోటల్ బిజినెస్ ఇంతేనా…రీజన్ ఇదే…టార్గెట్ ఇది!!

40 కోట్ల బింబిసార టోటల్ బిజినెస్ ఇంతేనా…రీజన్ ఇదే…టార్గెట్ ఇది!!

0

బాక్స్ ఆఫీస్ దగ్గర ఈ వీకెండ్ లో ఆడియన్స్ ముందుకు భారీ లెవల్ లో రిలీజ్ అవ్వడానికి సిద్ధం అవుతున్న సినిమాలలో మంచి అంచనాలు క్రియేట్ చేసిన సినిమా కళ్యాణ్ రామ్ నటించిన లేటెస్ట్ మైతలాజికల్ ఫాంటసీ మూవీ బింబిసార. ఆల్ మోస్ట్ 40 కోట్లకు పైగా భారీ బడ్జెట్ తో రూపొందిన ఈ సినిమా బిజినెస్ పరంగా మాత్రం బజ్ ఉన్నప్పటికీ మరీ భారీ బిజినెస్ ను ఏమి సొంతం చేసుకోలేదు…

చాలా రీజనబుల్ బిజినెస్ నే సొంతం చేసుకున్న ఈ సినిమా ఇప్పుడు టాక్ కనుక పాజిటివ్ గా వస్తే బాక్స్ ఆఫీస్ దగ్గర అవలీలగా బ్రేక్ ఈవెన్ ని అందుకునే అవకాశం ఎంతైనా ఉందని చెప్పాలి. సినిమా ఇలా తక్కువ బిజినెస్ ను సొంతం చేసుకోవడానికి కారణం…

సినిమా కి నాన్ థియేట్రికల్ రైట్స్ అన్నీ కలిపి చాలా మొత్తం రికవరీ అయిందట. ఆ కారణంగానే బిజినెస్ రీజనబుల్ రేట్స్ కి ఇచ్చేసి ఇప్పుడు సినిమాను భారీగా రిలీజ్ చేస్తున్నారు మేకర్స్… ఒకసారి బింబిసార సినిమా టోటల్ వరల్డ్ వైడ్ గా సాధించిన ప్రీ రిలీజ్ బిజినెస్ లెక్కలను గమనిస్తే…..

👉Nizam – 5Cr
👉Ceeded – 2Cr
👉Andhra – 6.50Cr
AP TG:- 13.50Cr
👉Ka+ROI – 1.1Cr
👉OS – 1Cr
Total WW:- 15.60Cr
ఇదీ ఓవరాల్ గా సినిమా మొత్తం మీద సాధించిన ప్రీ రిలీజ్ బిజినెస్ లెక్కలు….భారీ బడ్జెట్ తో వస్తున్న సినిమా ఇంత తక్కువ బిజినెస్ ను సొంతం చేసుకోవడం రీసెంట్ టైం లో ఇదే ఫస్ట్ టైం అని చెప్పొచ్చు. దాంతో ఇప్పుడు సినిమా…

బాక్స్ ఆఫీస్ దగ్గర క్లీన్ హిట్ అవ్వాలి అంటే మినిమమ్ 16.20 కోట్ల రేంజ్ లో షేర్ ని ఓవరాల్ గా సొంతం చేసుకుంటే క్లీన్ హిట్ అవుతుంది. టాక్ బాగుంటే సినిమా అవలీలగా వీకెండ్ లోనే చాలా మొత్తాన్ని వెనక్కి రాబట్టే అవకాశం ఎంతైనా ఉందని చెప్పాలి. ఇక సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ఎలా పెర్ఫార్మ్ చేస్తుందో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here