వరుస ఫ్లాఫ్స్ కి ఒకే ఒక జీవితం సినిమాతో బ్రేక్ వేసినట్లే వేసిన శర్వానంద్ ఇంకా జోరు చూపించాల్సిన అవసరం ఎంతైనా ఉంది బాక్స్ ఆఫీస్ దగ్గర. సినిమా అందుకోవాల్సిన టార్గెట్ తక్కువే అయినా కానీ సినిమా ఇంకా బెటర్ గా హోల్డ్ చేసి ఉండాల్సింది ఓవరాల్ గా సినిమా కి వచ్చిన టాక్ దృశ్యా… మంచి టాక్ ను తెచ్చుకున్నా కానీ సినిమా ఏ సెంటర్స్ లో బాగానే హోల్డ్ చేసినా…
మాస్ సెంటర్స్ లో మట్టుకు బ్రహ్మాస్త్ర సినిమా ఇంపాక్ట్ వలన అక్కడ హోల్డ్ అనుకున్న రేంజ్ లో అయితే లేదు అనే చెప్పాలి. మొత్తం మీద సినిమా 4వ రోజు వర్కింగ్ డే లో అటూ ఇటూగా 70 లక్షల రేంజ్ లో షేర్ ని…
అందుకుంటుంది అనుకున్నా కానీ సినిమా 62 లక్షల రేంజ్ షేర్ తోనే సరిపెట్టుకుంది. ఇక వరల్డ్ వైడ్ గా 79 లక్షల రేంజ్ లో షేర్ ని ఓవరాల్ గా సొంతం చేసుకుంది, సినిమా కి వచ్చిన టాక్ కి మంచి హోల్డ్ అనిపించుకోవడానికి 90 లక్షల రేంజ్ లో షేర్ ని అందుకోవాల్సి ఉంటుంది కానీ సినిమా…
మొత్తం మీద బాక్స్ ఆఫీస్ దగ్గర ఇప్పుడు 4 రోజులు పూర్తీ అయ్యే టైం కి సాధించిన టోటల్ కలెక్షన్స్ ని గమనిస్తే…
👉Nizam: 1.96Cr
👉Ceeded: 30L
👉UA: 40L
👉East: 28L
👉West: 21L
👉Guntur: 28L
👉Krishna: 25L
👉Nellore: 16L
AP-TG Total:- 3.84CR(6.30Cr~ Gross)
👉Ka+ROI- 47L
👉OS – 1.20Cr
Total World Wide – 5.51CR(10.50CR~ Gross)
మొత్తం మీద సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర 4 రోజులు కంప్లీట్ అయ్యే టైం కి అందుకోవాల్సిన టార్గెట్ దృశ్యా 8 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ లో ఇంకా 2.49 కోట్ల షేర్ ని ఇంకా అందుకోవాల్సి ఉంటుంది. ఇక సినిమా మిగిలిన రోజుల్లో ఎలాంటి కలెక్షన్స్ ని సొంతం చేసుకుంటుందో చూడాలి ఇక…