బాక్స్ ఆఫీస్ దగ్గర 2017 టైం లో కెరీర్ లో పీక్ స్టేజ్ ను ఎంజాయ్ చేసిన శర్వానంద్ తర్వాత నుండి వరుస పెట్టి డిసాస్టర్ మూవీస్ తో పూర్తీగా రేసులో వెనకబడి పోయాడు. పడి పడి లేచే మనసు, రణ రంగం, జాను, శ్రీకారం, మహా సముద్రం, ఆడవాళ్ళు మీకు జోహార్లు ఇలా ఒకటి తర్వాత ఒకటి రిలీజ్ అయ్యి 6 సినిమాలు బాక్స్ ఆఫీస్ దగ్గర డిసాస్టర్ రిజల్ట్ ను సొంతం చేసుకున్నాయి..
దాంతో శర్వానంద్ లేటెస్ట్ మూవీ ఒకే ఒక జీవితం పై ఎవ్వరిలో కూడా అంచనాలు లేవు, ఎప్పుడో రిలీజ్ అవ్వాల్సిన ఈ సినిమా లేట్ అవుతూ ఉండటంతో ఈ సినిమా కూడా ఫ్లాఫ్స్ లిస్టులోనే చేరుతుంది అని అందరూ అనుకున్నారు…
కానీ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి పాజిటివ్ టాక్ ను సొంతం చేసుకున్నా పోటీ వలన హిట్ గీతని దాటడానికి 9 రోజుల టైం పట్టగా ఇప్పుడు బ్రేక్ ఈవెన్ ని పూర్తీ చేసుకుని 5 ఏళ్ల తర్వాత శర్వానంద్ కి క్లీన్ హిట్ మూవీ గా నిలిచి తిరిగి ఊపిరి పోసింది అని చెప్పాలి.
ఇక ఈ సినిమా 2022 ఇయర్ టాలీవుడ్ లో ఇప్పటి వరకు రిలీజ్ అయిన అన్ని సినిమాలలో 13 వ క్లీన్ హిట్ సినిమాగా నిలిచింది, తెలుగు రాష్ట్రాల్లో బ్రేక్ ఈవెన్ కి మరికొంత కష్టపడాల్సి ఉన్నా మిగిలిన చోట్ల కలెక్షన్స్ తో కంప్లీట్ బ్రేక్ ఈవెన్ ని అందుకున్న ఈ సినిమా తో శర్వానంద్ ఇప్పుడు తిరిగి హిట్ ట్రాక్ ఎక్కాడు అని చెప్పాలి.
ఆ 13 సినిమాలు కూడా mention చెయ్యాల్సింది బ్రో…. Atleast next post lo అయిన ఆ 13 మూవీస్ మీద article pettu…