శర్వానంద్ నటించిన సినిమాలు బాక్స్ ఆఫీస్ దగ్గర రీసెంట్ టైం లో నిరాశ పరిచినా కానీ తనతో నిర్మాతలు మంచి బడ్జెట్ తో సినిమాలను నిర్మించడానికి ముఖ్య కారణం ఆ సినిమాలకు డిజిటల్, శాటిలైట్ అండ్ డబ్బింగ్ రైట్స్ కి సాలిడ్ బిజినెస్ జరుగుతూ ఉండటం అనే చెప్పాలి. అందుకే 5 ఏళ్ళుగా ఫ్లాఫ్స్ ను ఎదురుకున్నా కానీ శర్వానంద్ మూవీస్ కి మంచి బిజినెస్ జరుగుతూనే ఉంది. ఇక లేటెస్ట్ గా…
శర్వానంద్ నటించిన ఒకే ఒక జీవితం సినిమా అంచనాలు లేకుండా బరిలోకి దిగి కలెక్షన్స్ పరంగా మరీ అద్బుతాలు సృష్టించక పోయినా కానే టార్గెట్ ను అందుకుని లాభాలను కూడా కొద్ది వరకు సొంతం చేసుకోగా సినిమా విజయం చూసిన తర్వాత సినిమాకి…
డిజిటల్ రైట్స్ ఇప్పుడు తెలుగు మరియు తమిళ్ కలిపి సెన్సేషనల్ రేటు సొంతం అయ్యిందని సమాచారం. ఈ రేంజ్ లో రేటు అయితే ఎవ్వరూ అంచనా కూడా వేయలేదు అనే చెప్పాలి. ఏకంగా 10 కోట్ల రేంజ్ రేటు చెల్లించి సినిమా డిజిటల్ హక్కులను సోనీ లివ్ వాళ్ళు సొంతం చేసుకున్నారని సమాచారం.
ఈ రేంజ్ రేటు అంటే ఆల్ మోస్ట్ బిజినెస్ పై సగం పైగా రికవరీ ఇక్కడే జరిగింది అని చెప్పాలి. బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి కలెక్షన్స్ తో దుమ్ము లేపిన ఈ సినిమా డిజిటల్ రైట్స్ తో ఎక్స్ లెంట్ రేటు ని సొంతం చేసుకోగా ఇక శాటిలైట్ అండ్ డబ్బింగ్ రైట్స్ ద్వారా ఇంకా ఎంతవరకు సొంతం చేసుకుంటుందో చూడాలి.