బాక్స్ ఆఫీస్ దగ్గర కర్నాటక లో రికార్డ్ కలెక్షన్స్ ని సొంతం చేసుకున్న కాంతార సినిమా ఇప్పుడు ఇతర భాషల డబ్బింగ్ వర్షన్ లు ఆడియన్స్ ముందుకు ఈ వీకెండ్ లో రిలీజ్ అయ్యాయి, కాగా సినిమాకి తెలుగు లో కూడా డీసెంట్ లెవల్ లో డిమాండ్ ఏర్పడగా గీతా ఆర్ట్స్ వాళ్ళు ఆల్ మోస్ట్ 305 కి పైగా థియేటర్స్ లో సినిమాను తెలుగు రాష్ట్రాల్లో రిలీజ్ చేశారు… ఇక సినిమాకి…
ఆడియన్స్ నుండి మంచి పాజిటివ్ రెస్పాన్స్ లభించడంతో కలెక్షన్స్ ఎలా ఉంటాయి అన్నది ఆసక్తిగా మారగా సినిమాకి రిలీజ్ కి ముందు రోజు టోటల్ నైజాంలో 40 లక్షల దాకా గ్రాస్ బుకింగ్స్ జరగగా టోటల్ గా తెలుగు రాష్ట్రాల్లో…
50 లక్షల రేంజ్ లో గ్రాస్ బుకింగ్స్ జరిగాయి, ఓ డబ్బింగ్ మూవీ కి ఇది ఎక్స్ లెంట్ బుకింగ్స్ అనే చెప్పాలి. ఇక సినిమా తొలిరోజు తెలుగు రాష్ట్రాల్లో అటూ ఇటూగా 90 లక్షల రేంజ్ లో షేర్ ని అందుకునే అవకాశం కనిపిస్తూ ఉండగా…
అన్ని చోట్లా ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ లెక్కలు బాగుంటే ఫైనల్ లెక్క కోటి నుండి 1కోటి 20 లక్షల దాకా వెళ్ళే అవకాశం కనిపిస్తుంది, ఇది ఎక్స్ లెంట్ స్టార్ట్ అనే చెప్పాలి, ఫైనల్ ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ పై ఈ కలెక్షన్స్ మరింత ముందుకు వెళతాయ లేక ఇదే లెవల్ లో ఓపెనింగ్స్ వస్తాయి అన్నది ఆధారపడి ఉంది.