బాక్స్ ఆఫీస్ దగ్గర దీపావళి కన్నా ముందు రిలీజ్ అయిన కన్నడ డబ్ మూవీ కాంతార తెలుగు రాష్ట్రాల్లో ఊహకందని రేంజ్ లో కలెక్షన్స్ భీభత్సం సృష్టించింది. బాక్స్ ఆఫీస్ దగ్గర 5 వారాలుగా లాంగ్ రన్ ని కొనసాగిస్తూ వెళుతూ ఉన్న ఈ సినిమా ఇప్పటికీ షేర్స్ ని సొంతం చేసుకుంటూ ఉండగా సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర తెలుగు రాష్ట్రాల్లో రీసెంట్ గా 50 కోట్ల గ్రాస్ మార్క్ ని అందుకుంది.
అల్టిమేట్ కలెక్షన్స్ తో రన్ అవుతున్న ఈ సినిమా తెలుగు శాటిలైట్ రైట్స్ సాలిడ్ రేటు కి అమ్మారని టాలీవుడ్ లేటెస్ట్ న్యూస్. ఈ రేంజ్ లో విజయాన్ని నమోదు చేసిన ఈ సినిమా తెలుగు శాటిలైట్ రైట్స్ కోసం ఛానెల్స్ అన్నీ కూడా పోటి పడగా….
ఉన్న ఛానెల్స్ లో హైయెస్ట్ రేటుని కోట్ చేసిన ఛానెల్ గా స్టార్ మా నిలిచిందని సమాచారం…. ఆల్ మోస్ట్ ఈ సినిమా శాటిలైట్ రైట్స్ కోసం 4.5 కోట్ల రేంజ్ లో రేటు ని చెల్లించడానికి ఛానెల్ ఒప్పుకుందని అంటున్నారు. ఓ డబ్బింగ్ సినిమా కి శాటిలైట్స్ రైట్స్ పరంగా….
ఈ రేంజ్ లో రేటు సొంతం అవ్వడం అన్నది మామూలు విషయం కాదనే చెప్పాలి. ఆ రేంజ్ లో దుమ్ము లేపిన ఈ సినిమా ఇప్పటికీ థియేటర్స్ లో రన్ అవుతూ ఉండగా టెలివిజన్ లో టెలికాస్ట్ అయినప్పుడు ఎలాంటి రేటింగ్స్ తో అదరగొడుతుంది అన్నది ఆసక్తి కరం అని చెప్పాలి.