బాక్స్ ఆఫీస్ దగ్గర ఈ వీకెండ్ లో ఆడియన్స్ ముందుకు వచ్చిన సినిమాల్లో టెలివిజన్ నుండి వెండితెరకి వచ్చిన సుదిగాడి సుధీర్ హీరోగా నటించిన కొత్త సినిమా గాలోడు ఒకటి, సుధీర్ నటించిన సాఫ్ట్ వేర్ సుధీర్ సినిమా డీసెంట్ కలెక్షన్స్ ని సాధించగా ఇప్పుడు గాలోడు సినిమా ఆ కలెక్షన్స్ ని మూడు రోజుల్లోనే బ్రేక్ చేసి సుధీర్ కెరీర్ లో ఇప్పుడు నంబర్ 1 షేర్ ని అందుకున్న సినిమాగా….
నిలిచి దుమ్ము దుమారం లేపింది. ఇక సినిమా ఇలాంటి కలెక్షన్స్ ని మిక్సుడ్ టాక్ తోనే సొంతం చేసుకోవడం ట్రేడ్ ని కూడా విస్మయానికి గురిచేస్తుంది.. సినిమా కి తొలి ఆటకే మిక్సుడ్ టాక్ ఆడియన్స్ నుండి సొంతం అవ్వగా ఓపెనింగ్ డే కలెక్షన్స్ వచ్చినా…
రెండో రోజు నుండి సినిమా స్లో అవుతుంది అని అందరూ అనుకున్నారు, కానీ సినిమా రెండో రోజు కూడా ఎక్స్ లెంట్ హోల్డ్ ని చూపించగా మూడో రోజు ఏకంగా మొదటి రోజు కి మించే రేంజ్ లో కలెక్షన్స్ ని సొంతం చేసుకుని టార్గెట్ లో చాలా వరకు రికవరీ చేసింది.
ఇదంతా కూడా మిక్సుడ్ టాక్ తోనే సొంతం చేసుకోగా అదే సినిమా కి మంచి పాజిటివ్ టాక్ కనుక వచ్చి ఉంటే బాక్స్ ఆఫీస్ దగ్గర కచ్చితంగా ఇంకా బెటర్ కలెక్షన్స్ ని సొంతం చేసుకుని ఉండేది అని చెప్పాలి. ఫ్యూచర్ లో కొంచం బెటర్ స్క్రిప్ట్ అండ్ బెటర్ కాంబినేషన్ ని సుధీర్ సెట్ చేసుకుంటే కచ్చితంగా మంచి ప్రామిసింగ్ హీరో అయ్యే అవకాశం ఉందని చెప్పాలి.