బాక్స్ ఆఫీస్ దగ్గర ఈ ఇయర్ ఎలాంటి అంచనాలు లేకుండా రిలీజ్ అయ్యి ఊహకందని కలెక్షన్స్ ని సొంతం చేసుకున్న సినిమాల్లో మసూద సినిమా ముందు నిలుస్తుంది. అసలు ఎవ్వరికీ పెద్దగా సినిమా పై అంచనాలు లేకుండానే ఆడియన్స్ ముందుకు వచ్చి మంచి పాజిటివ్ రివ్యూలను సొంతం చేసుకున్న ఈ సినిమా ఫైనల్ రన్ లో అనుకున్న అంచనాలను అన్నీ కూడా మించి పోయి ఎక్స్ లెంట్ కలెక్షన్స్ ని సొంతం చేసుకుంది.
సినిమా చాలా తక్కువ బడ్జెట్ లో తెరకెక్కిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర కొత్త సినిమాలు రిలీజ్ అవుతున్నా కానీ స్టడీ కలెక్షన్స్ ని సొంతం చేసుకుంటూ ఏకంగా 10 కోట్ల గ్రాస్ మార్క్ ని కూడా దాటేసి ఏకంగా 11.72 కోట్ల రేంజ్ లో… గ్రాస్ ను అందుకుంది.
సినిమా ఫైనల్ రన్ లో బాక్స్ ఆఫీస్ దగ్గర సాధించిన కలెక్షన్స్ ని గమనిస్తే….
👉Nizam – 6.13Cr
👉Ceeded – 1.03Cr
👉Andhra – 4.01Cr
Total AP TG:- 11.17CR~Gross(6.02CR~ Share)
👉KA+ROI+OS – 55L
👉WW – 11.72CR~ Gross(6.26~ Share )
ఇదీ మొత్తం మీద సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర సాధించిన కలెక్షన్స్ లెక్క. సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర 1.50 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగి ఫైనల్ రన్ లో ఏకంగా 4.76 కోట్ల రేంజ్ లో ప్రాఫిట్ ను సొంతం చేసుకుని ట్రిపుల్ బ్లాక్ బస్టర్ హిట్ గా పరుగును కంప్లీట్ చేసుకుంది.