Home న్యూస్ అజిత్ తెగింపు రివ్యూ….ప్లస్ అండ్ మైనస్ పాయింట్స్!

అజిత్ తెగింపు రివ్యూ….ప్లస్ అండ్ మైనస్ పాయింట్స్!

0

కోలివుడ్ టాప్ హీరోలలో ఒకరైన అజిత్ కుమార్ నటించిన లేటెస్ట్ మూవీ తునివు తెలుగులో తెగింపు పేరుతో డబ్ అయ్యి తెలుగు రాష్ట్రాల్లో ఆల్ మోస్ట్ 460 కి పైగా థియేటర్స్ లో రిలీజ్ అయింది. వారసుడు పోస్ట్ పోన్ అవ్వడంతో సోలోగా గ్రాండ్ రిలీజ్ ను సొంతం చేసుకున్న తెగింపు సినిమా తెలుగు ఆడియన్స్ ను ఎంతవరకు మెప్పించింది అన్న విషయాలను తెలుసుకుందాం పదండీ… ముందుగా సినిమా స్టొరీ పాయింట్ విషయానికి వస్తే ఓ బ్యాంక్ రాబరీతో సినిమా స్టార్ట్ అవ్వగా విలనిష్ టైప్ లో హీరో రోల్ స్టార్టింగ్ లో ఉంటుంది…

ఇంతకీ హీరో సినిమాలో విలనా లేక హీరోనా, బ్యాంగ్ రాబరీకి హీరోకి లింక్ ఏంటి, బ్యాంక్స్ లో డిఫెరెంట్ స్కీమ్స్ తో జనలాను ఎలా దోచుకుంటున్నాయి, ఇలాంటి విషయాలు అన్నీ సినిమా చూసి తెలుసుకోవాల్సిందే… పెర్ఫార్మెన్స్ పరంగా అజిత్ కుమార్ తన ఫ్యాన్స్ ని బాగానే సాటిస్ ఫై చేశాడు అని చెప్పాలి. లుక్స్ కానీ ఎనర్జీ కానీ హీరోయిజం సీన్స్ కానీ…

ఫ్యాన్స్ వరకు బాగానే ఇంప్రెస్ చేశాడు, మంజు వారియర్ రోల్ కూడా పర్వాలేదు అనిపించినా మిగిలిన యాక్టర్స్ కూడా ఒకే… సంగీతం ఓకే అనిపించగా బ్యాగ్రౌండ్ స్కోర్ కూడా పర్వాలేదు. కానీ ఇలాంటి స్క్రీన్ ప్లే బేస్ మూవీస్ కి బ్యాగ్రౌండ్ స్కోర్ ఇంకా చాలా బెటర్ గా ఉండాల్సిన అవసరం ఉంది. ఎడిటింగ్ యావరేజ్ గా ఉండగా సినిమాటోగ్రఫీ బాగుంది. ఇక డైరెక్షన్ విషయానికి వస్తే…..

వినోద్ ఇది వరకు అజిత్ తో నేర్కొండ పార్వై, వలిమై సినిమాలు తీయగా మొదటి సినిమా మెప్పించగా వలిమై నిరాశ పరిచింది. ఇక ఇప్పుడు తెగింపు సినిమా పార్టు పార్టులుగా పర్వాలేదు అనిపించినా అది ఫ్యాన్స్ వరకు మాత్రమే, పండగ టైంలో ఫ్యామిలీ ఆడియన్స్ కోరుకునే ఎలిమెంట్స్ అయితే ఇందులో లేవనే చెప్పాలి. సినిమాలో అజిత్ రోల్, సెకెండ్ ఆఫ్ లో ఇచ్చే మెసేజ్ మేజర్ ప్లస్ పాయింట్స్ అయితే… వీక్ డైరెక్షన్, కన్ఫ్యూజింగ్ స్క్రీన్ ప్లే, యావరేజ్ ఫస్టాఫ్ లాంటివి మేజర్ డ్రా బ్యాక్స్….

మొత్తం మీద మెనీ హేస్ట్ ని ఇన్స్పిరేషన్ గా తీసుకుని చేసిన ఈ సినిమా అజిత్ నుండి ఫ్యాన్స్ కోరుకునే అంశాలు కొన్ని ఉన్నా కామన్ ఆడియన్స్ కి సినిమా పెద్దగా ఎక్కే అవకాశం చాలా తక్కువ… ఎలాంటి అంచనాలు లేకుండా వెళ్ళే ఆడియన్స్ చాలా ఓపిక చేసుకుని చూస్తె సినిమా అతి కష్టం మీద ఒకసారి చూడొచ్చు అనిపిస్తుంది… మొత్తం మీద సినిమా కి మా రేటింగ్ 2.25 స్టార్స్…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here