నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ అమిగోస్ మూవీ మొదటి రోజు లో బుకింగ్స్ వలన ముందు అనుకున్న అంచనాలను ఓవరాల్ గా కొంచం మించి పర్వాలేదు అనిపించేలా కలెక్షన్స్ ని సొంతం చేసుకున్నా కానీ ఓవరాల్ గా బింబిసార ఓపెనింగ్స్ తో పోల్చుకుంటే మాత్రం చాలా తక్కువ కలెక్షన్స్ నే సొంతం చేసుకుంది. ఇక సినిమా రెండో రోజు శనివారం వీకెండ్ అడ్వాంటేజ్ ఉన్నప్పటికీ కూడా మొత్తం మీద…
మొదటి రోజుతో కంపేర్ చేస్తే ఆన్ లైన్ టికెట్ సేల్స్ ఆల్ మోస్ట్ ట్రాక్ చేసిన సెంటర్స్ లో 50% రేంజ్ లోనే డ్రాప్ అయ్యాయి… ఇక ఈవినింగ్ షోల బుకింగ్స్ కూడా పెద్దగా కనిపించడం లేదు. దాంతో సినిమా ఇప్పుడు బాక్స్ ఆఫీస్ దగ్గర మరోసారి…
ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ పైనే డిపెండ్ అయ్యి పరుగును కొనసాగించబోతుంది. దాంతో ప్రజెంట్ ట్రెండ్ ని బట్టి చూస్తుంటే సినిమా రెండో రోజు బాక్స్ ఆఫీస్ దగ్గర 80 లక్షలకి అటూ ఇటూగా షేర్ ని అందుకునే అవకాశం కనిపిస్తూ ఉండగా అన్ని చోట్లా ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ ని…
బట్టే ఈ కలెక్షన్స్ కూడా కొంచం అటూ ఇటూ ఉండే అవకాశం ఉంది. ఇక సినిమా ఓవర్సీస్ లో 88 వేల డాలర్స్ అందుకోగా ఈ రోజు కలెక్షన్స్ తో లక్ష మార్క్ ని దాటబోతుంది. ఇక మొత్తం మీద డే ఎండ్ అయ్యే టైంకి సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ఇదే విధంగా పెర్ఫార్మ్ చేస్తుందో లేక గ్రోత్ ఏమైనా చూపిస్తుందో చూడాలి.