బాక్స్ ఆఫీస్ దగ్గర నందమూరి కళ్యాణ్ రామ్ నటించిన లేటెస్ట్ మూవీ అమిగోస్ సినిమా తెలుగు రాష్ట్రాల్లో వీకెండ్ లోనే యావరేజ్ కలెక్షన్స్ ని సొంతం చేసుకున్న తర్వాత వర్కింగ్ డేస్ లో మరింతగా స్లో డౌన్ అయింది. చాలా సింగిల్ స్క్రీన్స్ లో డెఫిసిట్ లు కూడా పడ్డాయి. సినిమాకి ఇలాంటి పరిస్థితి రావడానికి సినిమా టైటిల్, ట్రైలర్ ఆడియన్స్ లో బజ్ ని క్రియేట్ చేయలేక పోవడం, సినిమా కి…
రిలీజ్ రోజు నుండి టాక్ కూడా మిక్సుడ్ గా ఉండటం కారణాలు కాగా వీటితో పాటు సినిమాకి పెట్టిన టికెట్ హైక్స్ కూడా మరో రీజన్ అని చెప్పాలి. కళ్యాణ్ రామ్ బింబిసార సినిమా నార్మల్ టికెట్ రేట్స్ తోనే రిలీజ్ అయ్యి ఎక్స్ లెంట్ కలెక్షన్స్ ని అందుకుంది.
కానీ అమిగోస్ సినిమా కి బజ్ లేక పోయినా టికెట్ హైక్స్ పెట్టారు. దాంతో వీకెండ్ లో చూడటానికి పెద్దగా ఆసక్తి చూపించని ఆడియన్స్ ఇప్పుడు వీకెండ్ తర్వాత అయినా సినిమా టికెట్ హైక్స్ ని తగ్గిస్తారేమో అనుకుంటే… సినిమా స్లో అయినా 4వ రోజున….
దెబ్బ పడినా కానీ టికెట్ హైక్స్ ని మాత్రం తగ్గించలేదు. దాంతో 4వ రోజు భారీగా స్లో అయిన సినిమా 5వ రోజు నుండి మరింత స్లో అయింది.. టికెట్ హైక్స్ తగ్గించి ఉంటే కొంచం ఆక్యుపెన్సీ అయినా పెరిగి ఉండేది కానీ ఇప్పుడు దెబ్బ మీద దెబ్బ పడినట్లు అయింది సినిమా కి.