కొన్ని సినిమాలు అంతే….అన్ని చోట్లా ఆడియన్స్ ను తీవ్రంగా నిరాశ పరుస్తూ ఉంటాయి. కొన్ని సినిమాలు ఒక వర్గం వాళ్ళను అయినా ఆకట్టుకోవచ్చు కానీ కొన్ని సినిమాల పరిస్థితి కంప్లీట్ గా రివర్స్ లో ఉంటుంది. ప్రస్తుతం ఇలాంటి విముఖతని ఫేస్ చేస్తున్న సినిమా కబ్జా… ఆడియన్స్ ముందుకు కన్నడ నుండి భారీ అంచనాలతో వచ్చిన ఈ సినిమా కన్నడ తరుపున మరో కేజిఎఫ్, కాంతార రేంజ్ సక్సెస్ ను పాన్ ఇండియా…
రేంజ్ లో సొంతం చేసుకుంటుంది అని అనుకున్నారు కానీ సినిమా తొలి రోజే బొక్కబోర్లా పడింది. ఆల్ మోస్ట్ 110 కోట్ల రేంజ్ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర 10 కోట్ల షేర్ ని కూడా సరిగ్గా సొంతం చేసుకోలేక తీవ్రమైన డిసాస్టర్ గా పరుగును పూర్తీ చేసుకోగా…
సినిమా రీసెంట్ గా డిజిటల్ లో రిలీజ్ అవ్వగా అక్కడ సాలిడ్ వ్యూస్ నే సొంతం చేసుకుంటూ ఉన్నప్పటికీ కూడా సినిమాను చూసిన ఆడియన్స్ ఇదేం సినిమా రా బాబు అంటూ కామెంట్స్ తో సోషల్ మీడియా మొత్తం నిండిపోయింది అని చెప్పాలి. ఇంత బడ్జెట్ పెట్టి…
కేజిఎఫ్ మాదిరిగానే సినిమాను తీయాలి అని ఎలా అనిపించింది అంటూ బండ భూతులు తిడుతున్నారు సోషల్ మీడియాలో, అటు సినిమా కి వ్యూస్ సాలిడ్ గా వస్తూ టాప్ ప్లేస్ లో ట్రెండ్ అవుతున్నా ఇటు సోషల్ మీడియాలో మాత్రం మరోసారి భారీ ట్రోల్స్ కి గురి అవుతుంది సినిమా.. ఇక యూనిట్ మాత్రం ఇప్పుడు సీక్వెల్ కి అన్నీ సిద్ధం చేసుకుంటూ ఉండటం విశేషం.
Haa correct bro mana LIGER n Acharya movie laga worst ga ayyinda kadara karrim karroda