Home గాసిప్స్ సినిమా ఎపిక్ డిసాస్టర్….థియేటర్ ఓనర్స్ ని బ్లేం చేస్తున్న టీం!!

సినిమా ఎపిక్ డిసాస్టర్….థియేటర్ ఓనర్స్ ని బ్లేం చేస్తున్న టీం!!

0

బాక్స్ ఆఫీస్ దగ్గర రీసెంట్ గా భారీ అంచనాల నడుమ రిలీజ్ అయిన పాన్ ఇండియా మూవీ కబ్జా తీవ్రంగా నిరాశ పరిచే రిజల్ట్ ను సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. కానీ సినిమా ఏ దశలో కూడా మెప్పించలేక భారీ డిసాస్టర్ గా నిలవగా ఇప్పుడు సినిమా టీం సినిమా నిరాశ పరచడంతో తమ తప్పుతో పాటు థియేటర్స్ ఓనర్స్ తప్పులు కూడా ఉన్నాయి అంటూ వాళ్ళ మీదకి సినిమా ఫ్లాఫ్ ని తోసేస్తున్నారు…

సినిమా ఇండియాలో 4000 వరకు థియేటర్స్ లో రిలీజ్ చేశామని, కొన్ని చోట్ల సినిమా అంచనాలను అందుకొక పోవడంతో అక్కడ నుండి సినిమాను తొలిగించారని, కానీ బాగా పెర్ఫార్మ్ చేస్తున్న ఏరియాల్లో షోలు పెరిగాయని చెబుతూ కొందరు థియేటర్ ఓనర్స్ సినిమా సౌండ్ క్వాలిటీని తగ్గించి..

   

ఆడియన్స్ థియేటర్ ఎక్స్ పీరియన్స్ బ్యాడ్ అయ్యేలా చేశారని కామెంట్ చేశారు, సౌండ్ క్వాలిటీనీ తగ్గిస్తే ఒక్క థియేటర్ 10 వేల వరకు పవర్ బిల్ ను సేవ్ చేసుకోవచ్చని, చాలా మంది ఇదే చేయడం వలన సినిమా అనుకున్న విధంగా పెర్ఫార్మ్ చేయలేదని కామెంట్స్ చేస్తున్నారు.

కొందరు థియేటర్ ఓనర్స్ ఇది కంప్లీట్ గా ఫాల్స్ అని కొట్టి పారేశారు, కరెంట్ బిల్ కి సౌండ్ వాల్యూం కి సంభందం లేదని, సినిమా నిరాశ పరిచింది అని ఒప్పుకోక ఇలాంటి కామెంట్స్ చేయడం ఏంటి అంటూ చెబుతున్నారు… సినిమా ఆడియన్స్ అంచనాలను అందుకోలేదు అందుకే ఫ్లాఫ్ అయింది. కానీ ఇలాంటి ఆరోపణలు చేయడం ఏమాత్రం మంచిది కాదనే చెప్పాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here