మెగాస్టార్ చిరంజీవి చిన్నల్లుడు కళ్యాణ్ దేవ్ హీరోగా పరిచయం అయిన లేటెస్ట్ మూవీ విజేత బాక్స్ ఆఫీస్ దగ్గర రీసెంట్ గా రిలీజ్ అవ్వగా మొదటి ఆటకే యావరేజ్ టాక్ ని సొంతం చేసుకున్న ఈ సినిమా ఎ దశలోనూ కలెక్షన్స్ ని సాధించలేక పోయింది.
సినిమా మొత్తం మీద బాక్స్ ఆఫీస్ దగ్గర కేవలం 1.6 కోట్ల షేర్ ని మాత్రమె సాధించి భారీ షాక్ నే ఇచ్చింది. సినిమా మొత్తం మీద 4 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ ని సాధించగా 5 కోట్ల టార్గెట్ తో బరిలోకి దిగింది ఈ సినిమా. కానీ టాక్ బాలేకపోవడం, పోటిలో చిన్న సినిమా ఆర్ఎక్స్100 ఊచకోత కోయడం ఈ సినిమాకి ఎఫెక్ట్ అయింది.
దాంతో కలెక్షన్స్ లేక చేతులు ఎత్తేసిన ఈ సినిమా టోటల్ గా సుమారు 2.4 కోట్ల నష్టాన్ని మిగిలించింది…దాంతో బాక్స్ ఆఫీస్ పరుగును డిసాస్టర్ గా ముగించింది ఈ సినిమా. దాంతో డెబ్యూ హీరోగా పర్వాలేదనిపించే మార్కులు సాధించిన కళ్యాణ్ దేవ్ క్లీన్ హిట్ ని మాత్రం సొంతం చేసుకోలేక పోయాడు.