తెలుగు లో మీడియం రేంజ్ హీరోలలో బడ్జెట్ పరంగా ఎప్పుడూ పెద్ద బడ్జెట్ సినిమాలు చేసే హీరో బెల్లంకొండ శ్రీనివాస్ రీసెంట్ గా హిందీలోకి ఎంటర్ అవుతూ ఛత్రపతి సినిమాను అక్కడ రీమేక్ చేసిన విషయం తెలిసిందే. భారీ ఆశలను ఈ సినిమా మీద పెట్టుకున్న బెల్లంకొండ శ్రీనివాస్ కి ఈ సినిమా అయితే తీవ్రంగా నిరాశని మిగిలించింది అని చెప్పాలి ఇప్పుడు…
భారీ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా కలెక్షన్స్ పరంగా మినిమమ్ ఇంపాక్ట్ ని కూడా చూపించలేక ఎపిక్ డిసాస్టర్ గా నిలిచింది. 85 కోట్ల రేంజ్ బడ్జెట్ తో రూపొందిన ఈ సినిమా కి గాను బెల్లంకొండ శ్రీనివాస్ తీసుకునే రెమ్యునరేషన్ ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారిందని చెప్పాలి…
తెలుగులో తన సినిమాలకు నాన్ థియేట్రికల్ రైట్స్ సాలిడ్ గా ఉంటాయి కాబట్టి అటూ ఇటూగా 4-5 కోట్ల దాకా రెమ్యునరేషన్ ని తీసుకునే బెల్లంకొండ శ్రీనివాస్ ఇప్పుడు హిందీలో చేసిన మొదటి సినిమాకి మొత్తం మీద 8.50 కోట్ల రేంజ్ లో రెమ్యునరేషన్ ని తీసుకున్నట్లు ట్రేడ్ లో టాక్ ఉంది…
ఓవరాల్ గా తెలుగు మూవీస్ తో పోల్చితే ఆల్ మోస్ట్ డబుల్ రెమ్యునరేషన్ నే తీసుకున్నాడు అని చెప్పాలి, సినిమా కూడా వర్కౌట్ అవుతుంది అ అనుకున్నా కూడా హిందీలో బెల్లంకొండ శ్రీనివాస్ కి ఈ సినిమా తీవ్రంగా నిరాశ పరిచింది. ఇక తన ఫ్యూచర్ ప్రాజెక్ట్ లు ఎలాంటి రిజల్ట్ ను ఇస్తాయో చూడాలి.