Home గాసిప్స్ రావణాసుర డిసాస్టర్…డబ్బులు వెనక్కి ఇవ్వనున్న రవితేజ!

రావణాసుర డిసాస్టర్…డబ్బులు వెనక్కి ఇవ్వనున్న రవితేజ!

0

బాక్స్ ఆఫీస్ దగ్గర ధమాకా మూవీతో ఎపిక్ కంబ్యాక్ ను భారీ బ్లాక్ బస్టర్ ను సొంతం చేసుకున్న మాస్ మహారాజ్ రవితేజ తర్వాత చేసిన సినిమా రావణాసుర…. సినిమా కథ నచ్చడంతో సినిమాకి తాను కూడా వన్ ఆఫ్ ది ప్రొడ్యూసర్ గా మారిపోయిన రవితేజ సినిమా కచ్చితంగా ఆడియన్స్ ను అలరిస్తుంది అని నమ్మాడు, కానీ రవితేజ నుండి ఇలాంటి వైల్డ్ రోల్ ని…

ఆడియన్స్ అస్సలు జీర్ణించుకోలేక పోయారు. దాంతో సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర అత్యంత తీవ్రంగా నిరాశ పరచగా ఏ దశలో కూడా 23 కోట్ల టార్గెట్ ను అందుకోలేక 12 కోట్ల రేంజ్ లో షేర్ తో 11 కోట్ల దాకా నష్టాన్ని సొంతం చేసుకుని నిరాశ పరిచే డిసాస్టర్ గా నిలిచింది.

Ravanasura 6 Days Total WW Collections!!

ఈ సినిమా మీద రవితేజ నమ్మకంతో చెప్పిన రేటుకి ఓకే చేసి కొన్న బయ్యర్స్ సినిమా రిజల్ట్ వలన తీవ్రంగా నష్టపోవడంతో సినిమాకి కో ప్రొడ్యూసర్ గా కూడా ఉన్న రవితేజ ఇప్పుడు సినిమా ద్వారా నష్టపోయిన వాళ్ళని ఆదుకోవడానికి ముందుకు రాబోతున్నట్లు ఇండస్ట్రీలో మాట్లాడుకుంటున్నారు…

టోటల్ నష్టాన్ని రిటర్న్ ఇవ్వకున్నా తన వంతుగా కొంత వరకు నష్టాన్ని తగ్గించడానికి ఆల్ మోస్ట్ 3-4 కోట్ల దాకా వెనక్కి ఇవ్వడానికి రవితేజ సిద్ధం అయ్యారు అని ఇండస్ట్రీలో చెప్పుకుంటున్నారు. చాలా వరకు ఆఫ్ ది రికార్డ్ లోనే ఇది జరిగే అవకాశం ఉందని తెలుస్తుంది. ఇది కనుక నిజం అయితే ఇలా డబ్బులు వెనక్కి ఇవ్వడానికి ఒప్పుకునే విషయంలో రవితేజని మెచ్చుకుని తీరాల్సిందే అని చెప్పాలి.

Ravanasura 4 Days Total WW Collections!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here