Home న్యూస్ 2018 మూవీ రివ్యూ – రేటింగ్!

2018 మూవీ రివ్యూ – రేటింగ్!

0

గత రెండు వారాలకు పైగా ఇతర ఇండస్ట్రీల ఆడియన్స్ లో కూడా ఎప్పుడెప్పుడు చూస్తామా అన్న క్యూరియాసిటీని క్రియేట్ చేసిన సినిమా 2018, సర్వైవల్ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ సినిమా 2018 టైంలో కేరళలో వచ్చిన వరదల బ్యాగ్ డ్రాప్ తో తెరకెక్కగా మలయాళంలో ఎక్స్ లెంట్ రెస్పాన్స్ తో అక్కడ కొత్త ఇండస్ట్రీ హిట్ గా దూసుకు పోతున్న ఈ సినిమా ఈ నెల 26న మిగిలిన భాషల్లో రిలీజ్ కానుండగా ముందుగా ప్రీమియర్స్ ని పూర్తీ చేసుకుంది. మరి సినిమా తెలుగు లో ఎలా మెప్పించిందో తెలుసుకుందాం పదండీ…

స్టొరీ పాయింట్ కి వస్తే 2018 టైంలో డాం పక్కన నివసించే ప్రజలు మంచి నీళ్ళ కోసం కష్టపడాల్సి పరిస్థితులు ఉండగా మరో పక్క ప్రభుత్వం త్వరలో రాబోతున్న భారీ వరదలను ఎలా ఎదురుకోవాలి అన్న ప్రణాలికలు వేస్తూ ఉండగా భారీ వర్షాలతో వరదలు వచ్చేస్తాయి. తర్వాత ఏం జరిగింది, సామన్యులు కూడా ఎలా నిజ జీవితంలో హీరోలు అయ్యారు అన్నది సినిమా చూసి తెలుసుకోవాల్సిందే…

సినిమా కథ టేక్ ఆఫ్ కి కొంచం టైం పట్టింది, చిన్న చిన్న రోల్స్ లో మలయాళ నోటబుల్ యాక్టర్స్ ఉన్నప్పటికీ మనకు పెద్దగా ఎవరూ పరిచయం లేక పోవడంతో ఒకరిద్దరుని గుర్తు పట్టినా కొన్ని చిన్న చిన్న కథలను ముందు చెప్పి పాత్రలను పరిచయం చేయగా ఎప్పుడైతే వరదలు స్టార్ట్ అవుతాయో అప్పటి నుండి కథ ఊపు అందుకుంటుంది…

ప్రతీ సన్నివేశం ఎక్స్ లెంట్ గా తెరకెక్కగా, వరదలలో కొట్టుకు పోయే సీన్స్ గ్రాఫిక్స్ చాలా బాగా మెప్పించాయి… ఇక ప్రతీ సీన్ కి సౌండ్ ఎఫెక్ట్ అద్బుతంగా మెప్పించగా ఇంటర్వెల్ తర్వాత ఎపిసోడ్ ఎక్స్ లెంట్ గా ఉంటుంది. ఫస్టాఫ్ లో కొద్ది పార్ట్ పాత్రల పరిచయం వలన మనకు కొంచం బోర్ ఫీల్ అయ్యేలా చేస్తుంది కానీ తర్వాత నుండి కథ చాలా గ్రిప్పింగ్ గా సాగుతూ తర్వాత సీన్ ఏమవుతుందో అన్న ఆసక్తిని అలాగే మెయిన్ టైన్ చేస్తుంది…

సెకెండ్ ఆఫ్ లో చాలా సీన్స్ కి థియేటర్స్ లో విజిల్స్, చప్పట్ల వర్షం కురిసే రేంజ్ లో ఎలివేట్ అవ్వడం విశేషం, అందరి పాత్రలు బాగానే ఉండగా, అందరూ ఆ పాత్రల్లో అద్బుతంగా నటించి మెప్పించారు, సంగీతం పర్వాలేదు, బ్యాగ్రౌండ్ స్కోర్ ఎక్స్ లెంట్ గా ఉంది. ఎడిటింగ్ అండ్ స్క్రీన్ ప్లే అన్నీ బాగా కుదిరాయి, ఇక డైరెక్షన్ విషయానికి వస్తే… జూడ్ అంటనీ జోసెఫ్ డైరెక్ట్ చేసిన ఈ సినిమా…

ఫస్టాఫ్ లో కొంచం టేక్ ఆఫ్ కి టైం తీసుకున్నా కూడా సెకెండ్ ఆఫ్ ని మలచిన తీరు చూసి ఈ ఇయర్ లో ఇప్పటి వరకు వచ్చిన మూవీస్ లో వన్ ఆఫ్ ది బెస్ట్ మూవీ అని చెప్పే విధంగా మెప్పించింది అని చెప్పొచ్చు. ఫస్టాఫ్ లో పాత్రల పరిచయాన్ని కొంచం ఓపికతో చూస్తె తర్వాత సినిమా అనుకున్న దాని కన్నా కూడా ఇంకా ఎక్కువగానే ఆకట్టుకుంటుంది 2018 మూవీ….

సినిమాలో హైలెట్స్ విషయానికి వస్తే… లీడ్ యాక్టర్స్ అందరి పెర్ఫార్మెన్స్, ఎక్స్ లెంట్ సెకెండ్ ఆఫ్, మైండ్ బ్లోయింగ్ సౌండ్ డిసైన్, సూపర్బ్ గ్రాఫిక్స్… డైరెక్షన్ మేజర్ ప్లస్ పాయింట్స్ అని చెప్పాలి. ఇక మైనస్ ల విషయానికి వస్తే ముందే చెప్పినట్లు ఫస్ట్ ఆఫ్ టేక్ ఆఫ్ కి టైం తీసుకోవడం మాత్రమే మేజర్ గా డ్రాప్ బ్యాక్….

అయినా కానీ వన్స్ మనం సినిమాలో ఇన్వాల్వ్ అయిన తర్వాత ఈ లాగ్ లు లాంటివి ఏమి పట్టించుకోకుండా సెకెండ్ లో సీట్ ఎడ్జ్ లో కూర్చుని చూసే చాలా సన్నివేశాలు సినిమా ఎండ్ అయ్యే టైం కి ఓ మంచి సినిమా చూసిన ఫీలింగ్ ని కలిగించడం ఖాయం….మొత్తం మీద సినిమా కి మేం ఇస్తున్న రేటింగ్ 3 స్టార్స్…. 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here