బాక్స్ ఆఫీస్ దగ్గర ఎన్నో ఆశలు పెట్టుకుని హిందీలో తొలి సినిమాతోనే సంచలనం సృష్టించాలని ఎన్నో కళలు కన్నా బెల్లంకొండ శ్రీనివాస్ కి ఛత్రపతి సినిమా భారీగా నిరాశని మిగిలించగా ఈ సినిమా తర్వాత ప్రస్తుతం రవితేజ చేస్తున్న టైగర్ నాగేశ్వరరావు సినిమా మరో వర్షన్ కథ స్టూవర్టుపురం దొంగ అనే సినిమాను మొదలు పెట్టిన బెల్లంకొండ శ్రీనివాస్ కొన్ని కారణాల వలన…
ఆ సినిమాను ఆపెయగా ఇప్పుడు ఛత్రపతి సినిమా తర్వాత ఏ సినిమాతో కంబ్యాక్ ఇస్తాడో అని అందరూ ఎదురు చూస్తూ ఉండగా రీసెంట్ గా కొత్త సినిమాను బెల్లంకొండ శ్రీనివాస్ కమిట్ అయ్యాడని తెలుస్తుంది. రాకేశ్ ఉప్పలపాటి అనే డైరెక్టర్ డైరెక్షన్ లో ఓ స్పోర్ట్స్ డ్రామాని చేయబోతున్నాడట.
ఆ సినిమా కథ ఒలింపిక్స్ లో ముందు ఓడి తర్వాత గెలిచిన ఒక అథ్లెట్ స్టొరీని ఫీక్షనల్ నేపధ్యంలో కమర్షియల్ ఎలిమెంట్స్ కూడా జోడించి ఆకట్టుకునేలా తెరకెక్కించబోతున్నట్లు తెలుస్తుంది. కథ చాలా ఎమోషనల్ కనెక్షన్ తో పాటు కమర్షియల్ హంగులు బాగా సెట్ అయ్యాయని టాక్ ఉంది.
త్వరలోనే రెగ్యులర్ జరుపుకోబోతున్న ఈ సినిమా ప్రస్తుతానికి తెలుగు వరకే పరిమితం అన్న టాక్ ఉంది, కథ పాయింట్ యూనివర్సల్ గా వర్కౌట్ అయ్యే అవకాశం ఉండటంతో, పాన్ ఇండియా మూవీ గా మారే అవకాశం ఈ సినిమా కి ఉందని అంటున్నారు. మరి ఇందులో ఎంతవరకు నిజం ఉందీ అన్నది త్వరలో తెలుస్తుంది అని చెప్పాలి.