బాక్స్ ఆఫీస్ దగ్గర లాస్ట్ వీకెండ్ లో రిలీజ్ అయిన సినిమాల్లో 2018 మరియు మేమ్ ఫేమస్ సినిమాలు మంచి జోరునే చూపిస్తూ బాక్స్ అఫీస్ రన్ ని కొనసాగిస్తూ ఉండగా మేమ్ ఫేమస్ కన్నా 2018 మూవీ పాజిటివ్ టాక్ పవర్ తో దుమ్ము లేపుతూ ఆల్ రెడీ లాభాలను సొంతం చేసుకుని పరుగును కొనసాగిస్తూ ఉండగా వర్కింగ్ డేస్ లో రెండు సినిమాలు కూడా….
చాలా లిమిటెడ్ డ్రాప్స్ తోనే అప్రుగును కొనసాగిస్తూ ఉండటం విశేషం అని చెప్పాలి. మేమ్ ఫేమస్ మూవీకి స్టూడెంట్స్ కోసం స్పెషల్ ఆఫర్స్ ను పెడుతూ ఉండటంతో ఆక్యుపెన్సీ స్టడీగా ఉంది. 2018 ఏ సెంటర్స్ లో మంచి జోరుని చూపిస్తూ దూసుకు పోతుంది.
మొత్తం మీద మేమ్ ఫేమస్ మూవీ ఇప్పుడు 6వ రోజు మొత్తం మీద 5వ రోజుతో పోల్చితే 10% లోపే డ్రాప్ అవ్వగా అటూ ఇటూగా 35 లక్షల రేంజ్ లో గ్రాస్ ను సొంతం చేసుకునే అవకాశం ఉంది. ఇక 2018 మూవీ మరోసారి సాలిడ్ జోరునే కొనసాగిస్తూ ఉండగా…
70 లక్షల నుండి 75 లక్షల రేంజ్ లో గ్రాస్ ను మరోసారి అందుకునే అవకాశం ఉంది. మేమ్ ఫేమస్ మూవీ ఆల్ మోస్ట్ బ్రేక్ ఈవెన్ ని సొంతం చేసుకునే అవకాశం కనిపిస్తుంది. ఇక మొత్తం మీద 2 సినిమాల బాక్స్ ఆఫీస్ 6 డేస్ కలెక్షన్స్ రిపోర్ట్ ఏ విధంగా ఉంటుందో చూడాలి.