బాక్స్ ఆఫీస్ దగ్గర రీసెంట్ టైం లో వరుస పెట్టి పరాజయాలను ఫేస్ చేస్తున్న శర్వానంద్ మరోసారి తన లక్ ని పరీక్షించుకోవడానికి రష్మికతో కలిసి కిషోర్ తిరుమల డైరెక్షన్ లో ఆడవాళ్ళు మీకు జోహార్లు అనే ఫ్యామిలీ ఓరియెంటెడ్ మూవీ వచ్చేశాడు, మరి ఈ సినిమా తో ఆడియన్స్ ను ఎంతవరకు మరిపించాడు, వరుస పరజాయలకు బ్రేక్ వేశాడో లేదో సినిమా రివ్యూలోకి వెళ్లి తెలుసుకుందాం పదండీ… ముందుగా సినిమా కథ పాయింట్ విషయానికి వస్తే….
పెళ్లి చేసుకోవడానికి అమ్మాయి కోసం ఎదురు చూస్తుంటాడు హీరో, హీరో ఫ్యామిలీ మాత్రం అమ్మాయిలను రిజక్ట్ చేస్తూ ఉంటారు, ఇలాంటి టైం లో హీరో కి హీరోయిన్ పరిచయం అవుతుంది, తనని పెళ్లి చేసుకోవాలి అనుకుంటున్న టైం లో హీరోయిన్ అమ్మ అయిన ఖుష్బూతో సమస్య వస్తుంది….
మరి హీరో ఎలా తన ప్రాబ్లమ్స్ ని సాల్వ్ చేసుకున్నాడు అన్నది మొత్తం మీద మిగిలిన స్టొరీ పాయింట్, కథ పరంగా చెప్పాలి చాలా సాదాసీదా స్టొరీ లైన్ తో తెరకెక్కిన ఈ సినిమా శర్వానంద్ ఉన్నంతలో తన పెర్ఫార్మెన్స్ తో ఆకట్టుకోగా రష్మిక కూడా ఆకట్టుకోగా ఇద్దరి పెయిర్ బాగుంది. ఇక మిగిలిన స్టార్ కాస్ట్…
చాలా పెద్దదిగా ఉండగా అందరూ కూడా ఉన్నంతలో బాగానే ఆకట్టుకున్నారు, ఇక సాంగ్స్ పర్వాలేదు అనిపించగా, ఎడిటింగ్ అండ్ స్క్రీన్ ప్లే ఫస్టాఫ్ వరకు బాగున్నా సెకెండ్ ఆఫ్ మాత్రం కొంచం బోర్ కొట్టిస్తుంది, సినిమాటోగ్రఫీ ఆకట్టుకోగా ప్రొడక్షన్ వాల్యూస్ కూడా మెప్పిస్తాయి, ఇక డైరెక్షన్ పరంగా కిషోర్ తిరుమల చాలా తిన్ స్టొరీ లైన్ ని ఎంచుకుని….
ఫస్టాఫ్ వరకు కథని ఎంటర్ టైనింగ్ గా బాగానే చెప్పాడు, ఇంటర్వెల్ ఎపిసోడ్ కూడా బాగుంది, దాంతో సెకెండ్ ఆఫ్ పై అంచనాలు పెరగగా సెకెండ్ ఆఫ్ స్టార్ట్ అవ్వడం బాగానే స్టార్ట్ అయినా ఫస్టాఫ్ రేంజ్ లో ఎంటర్ టైన్ మెంట్ సెకెండ్ ఆఫ్ లో తగ్గడం తో అక్కడక్కడా కొంచం బోర్ ఫీల్ అవ్వాల్సి వస్తుంది…
అయినా కానీ రీసెంట్ శర్వానంద్ మూవీస్ లో మిస్ అయిన ఎంటర్ టైన్ మెంట్ ఇందులో మెప్పించడం, ఫ్యామిలీ ఆడియన్స్ కి నచ్చే అంశాలు సినిమాలో ఉండటం, కంప్లీట్ గా ఫ్యామిలీతో కలిసి చూసేలా సినిమా ఉండటం లాంటివి ప్లస్ పాయింట్స్ కాగా కథ అంత బలంగా లేక పోవడం సెకెండ్ ఆఫ్ కొంచం బోర్ కొట్టడం లాంటివి మైనస్ పాయింట్స్ అని చెప్పాలి…
ఎలాంటి అంచనాలు లేకుండా థియేటర్స్ కి వెళ్ళే ఆడియన్స్ కి ఫస్టాఫ్ బాగానే ఎంటర్ టైన్ చేస్తుంది, సెకెండ్ ఆఫ్ కొంచం బోర్ కొట్టినట్లు అనిపించినా ఓవరాల్ గా సినిమా ఒకసారి చూడొచ్చు అనిపించేలా ఉంటుంది అని చెప్పాలి. శర్వానంద్ రీసెంట్ మూవీస్ లో ఎంటర్ టైన్ మెంట్ వైజ్ ఇది బెటర్ ఔట్ పుట్ అని చెప్పొచ్చు. మొత్తం మీద సినిమా కి మా రేటింగ్ 2.75 స్టార్స్…..