Home న్యూస్ ఆ ఒక్కటీ అడక్కు ట్రైలర్ రివ్యూ….అల్లరి నరేష్ కి కంబ్యాక్ లా ఉందే!

ఆ ఒక్కటీ అడక్కు ట్రైలర్ రివ్యూ….అల్లరి నరేష్ కి కంబ్యాక్ లా ఉందే!

0

బాక్స్ ఆఫీస్ దగ్గర ఒకప్పుడు కామెడీ మూవీస్ కి కేరాఫ్ అడ్రస్ గా నిలిచి మినిమమ్ గ్యారెంటీ హీరోగా తనకంటూ డీసెంట్ మార్కెట్ ను సొంతం చేసుకున్న అల్లరి నరేష్(Allari Naresh) రీసెంట్ టైంలో అన్నీ సీరియస్ మూవీస్ చేస్తూ ఉండగా అందులో ఒకటి రెండు పర్వాలేదు అనిపించినా కూడా…

చాలా వరకు సినిమాలు అంచనాలను అందుకోలేదు…దాంతో రూట్ మళ్ళీ మార్చి కామెడీ మూవీతో కంబ్యాక్ కి సిద్ధం అయిన అల్లరోడు ఇప్పుడు ఆడియన్స్ ముందుకు ఈ సమ్మర్ లో ఆ ఒక్కటీ అడక్కు(Aa Okkati Adakku Movie)తో తన లక్ ని పరీక్షించుకోబోతున్నాడు… ఇక రీసెంట్ గా సినిమా అఫీషియల్ ట్రైలర్ ను…

రిలీజ్ చేయగా ట్రైలర్ లో కథ పాయింట్ 49 పెళ్లి చూపులు చూసినా ఎవ్వరూ పెళ్లికి సెట్ అవ్వని హీరోకి హీరోయిన్ తో పరిచయం ఏర్పడుతుంది. కానీ పెళ్లి పై పెద్దగా అభిప్రాయం లేని హీరోయిన్ మరియు హీరోలు ఎలా కలిశారో అన్నది ఓవరాల్ గా సినిమా కథగా అనిపిస్తుంది ట్రైలర్ చూస్తుంటే….

రొటీన్ స్టోరీ పాయింట్ గానే అనిపించిన ఆ ఒక్కటీ అడక్కు సినిమా ట్రైలర్ లో మళ్ళీ ఒకప్పటి అల్లరి నరేష్ కామెడీ టైమింగ్ మళ్ళీ కనిపించడం, సినిమా మంచి క్వాలిటీగానే అనిపిస్తూ ఉండటంతో మినిమమ్ గ్యారెంటీ అనిపించేలా సినిమా ఉండబోతుంది అనిపిస్తుంది.

కథ కొత్తగా ఏమి లేదన్నట్లు అనిపించినా మినిమమ్ గ్యారెంటీ కంటెంట్ తో రాబోతున్న ఆ ఒక్కటీ అడక్కు ఆడియన్స్ ముందుకు వచ్చిన పాజిటివ్ టాక్ ను సొంతం చేసుకుంటే కచ్చితంగా అల్లరి నరేష్ కి మంచి కంబ్యాక్ మూవీగా నిలిచే అవకాశం అయితే ఉంటుంది అని చెప్పాలి. మరి సినిమాకి ఎలాంటి రెస్పాన్స్ వస్తుందో చూడాలి ఇక…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here