Home న్యూస్ కూలీగా మారిన రజినీ…..600 కోట్ల ఊచకోత కాంబో ఇది!!

కూలీగా మారిన రజినీ…..600 కోట్ల ఊచకోత కాంబో ఇది!!

0

కోలివుడ్ సూపర్ స్టార్ రజినీకాంత్(Rajinikanth) లాస్ట్ ఇయర్ జైలర్(Jailer Movie) తో సెన్సేషనల్ కంబ్యాక్ ను సొంతం చేసుకున్నాడు….ఆ సినిమా తర్వాత ఇప్పుడు వేటయ్య సినిమాతో బిజీగా ఉన్న రజినీకాంత్ ఆ తర్వాత సినిమాను కోలివుడ్ మోస్ట్ హ్యాపెనింగ్ డైరెక్టర్స్ లో ముందు నిలిచే లోకేష్ కనగారాజ్ డైరెక్షన్ లో ఉండబోతుంది..

లాస్ట్ ఇయర్ ఇటు డైరెక్టర్ గా లోకేష్ అలాగే హీరోగా రజినీ 600 కోట్ల సినిమాలతో ఊచకోత కోశారు. లోకేష్ దళపతి విజయ్(Thalapathy Vijay) తో లియో(Leo Movie) తో 600 కోట్లకు పైగా గ్రాస్ ను అందుకుని దుమ్ము లేపగా రజినీ జైలర్ మూవీతో 600 కోట్ల తో దుమ్ము దుమారం లేపాడు…ఇలాంటి ఫామ్ లో ఉన్న…

ఇద్దరు క్రేజీ హీరో డైరెక్టర్ లో కాంబోలో వస్తున్న కొత్త సినిమా కి ఇప్పుడు అఫీషియల్ గా టైటిల్ ను కన్ఫాం చేశారు…సినిమా కి టైటిల్ గా కూలీ(Coolie Movie) అని టైటిల్ ను కన్ఫాం చేశారు. టైటిల్ ను కన్ఫాం చేస్తూ ఒక గ్లిమ్స్ వీడియోని రిలీజ్ చేయగా గోల్స్ స్మగ్లింగ్ నేపధ్యంలో ఈ సినిమా ఉండబోతుండగా…..

రజినీ ఫుల్ లెంత్ యాక్షన్ రోల్ లో ఈ సినిమాలో కనిపించబోతున్నట్లు సమాచారం. టైటిల్ గ్లిమ్స్ కి అనిరుద్ మంచి బ్యాగ్రౌండ్ స్కోర్ ని అందించినా అది మరీ రీసెంట్ మూవీస్ రేంజ్ తో పోల్చితే జస్ట్ ఓకే అనిపించే రేంజ్ లో ఉంది… ఓవరాల్ గా ఈ టైటిల్ గ్లిమ్స్ సినిమా మీద అంచనాలను ఓ రేంజ్ కి పెంచేసింది…

సినిమా త్వరలో రెగ్యులర్ షూటింగ్ ను జరుపుకోబోతుండగా ఫాస్ట్ గా సినిమాలను కంప్లీట్ చేస్తాడు అన్న పేరున్న లోకేష్ ఫామ్ లో ఉన్న రజినీతో చేస్తున్న ఈ సినిమాతో ఏమాత్రం అంచనాలను అందుకున్నా కూడా ఇండస్ట్రీ రికార్డుల బెండు తీసే అవకాశం ఎంతైనా ఉందని చెప్పాలి….

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here