అల్లు అర్జున్(Allu Arjun) పుష్ప(Pushpa Part 1) లో విలన్ గా చేసి తెలుగు వారికి చేరువ అయిన మలయాళ స్టార్ హీరో ఫహాద్ ఫాజిల్(Fahadh Faasil) హీరోగా మలయాళంలో వరుస పెట్టి సినిమాలు చేస్తూ తన మార్కెట్ ను పెంచుకుంటూ ఉండగా పుష్ప, విక్రం లాంటి సినిమాలతో ఇతర భాషల్లో కూడా మంచి గుర్తింపుని సొంతం చేసుకుంటూ ఉండటం విశేషం.
బాక్స్ ఆఫీస్ దగ్గర ఫహాద్ ఫాజిల్ నటించిన లేటెస్ట్ మూవీ ఆవేశం(Aavesham Movie) సినిమా మీద మలయాళంలో మంచి అంచనాలు ఏర్పడగా రీసెంట్ గా రంజాన్ కానుకగా ఈ సినిమా మలయాళంలో గ్రాండ్ గా రిలీజ్ అవ్వగా ఎక్స్ లెంట్ కలెక్షన్స్ తో దుమ్ము లేపుతూ 3 రోజుల్లో అద్బుతమైన కలెక్షన్స్ ని అందుకుంటూ దూసుకు పోతుంది.
సినిమా 3 రోజుల్లో కేరళలో పోటిలో 10 కోట్లకు పైగా గ్రాస్ ను వసూల్ చేయగా టోటల్ గా ఇండియాలో 13 కోట్లకు పైగా గ్రాస్ ను అందుకుంది. మలయాళ సినిమాలకు ఓవర్సీస్ లో సాలిడ్ మార్కెట్ ఉండగా ఈ సినిమా ఒక్క ఓవర్సీస్ నుండే 3 రోజుల్లో ఏకంగా 21 కోట్ల లోపు గ్రాస్ ను అందుకుందట.
దాంతో 3 రోజుల్లో వరల్డ్ వైడ్ గా 34 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను అందుకున్న సినిమా 4వ రోజు సండే అడ్వాంటేజ్ తో మరింత జోరు చూపించే అవకాశం ఉండగా 42 కోట్ల రేంజ్ లో వసూళ్లతో లాంగ్ వీకెండ్ ను ఈ సినిమా ఎంజాయ్ చేసే అవకాశం ఉందని అంటున్నారు…..
సినిమాకి రెస్పాన్స్ కూడా బాగుండటంతో త్వరలో తెలుగు డబ్ వర్షన్ కూడా వచ్చే అవకాశం ఉందని అంటూ ఉండగా బాక్ టు బాక్ హిట్స్ తో దూసుకు పోతున్న మలయాళ ఇండస్ట్రీ నుండి ఈ సినిమా మరో 100 కోట్ల సినిమాగా నిలిచే అవకాశం ఎంతైనా ఉందని అంచనా వేస్తూ ఉండటం విశేషం…