Home న్యూస్ ఇంత ట్రోల్స్ అయినా కానీ 100M ఏంటి సామి…అరాచకం ఇది!!

ఇంత ట్రోల్స్ అయినా కానీ 100M ఏంటి సామి…అరాచకం ఇది!!

0

రీసెంట్ టైం లో అసలు ఎవ్వరూ ఊహించని రేంజ్ ట్రోల్స్ ని సొంతం చేసుకున్న సినిమా ఆది పురుష్, ప్రభాస్ తో ఏకంగా 500 కోట్లకు పైగా భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా రేంజ్ లో రామాయణాన్ని బేస్ చేసుకుని ఓం రౌత్ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న ఈ సినిమా సంక్రాంతికి సందడి చేయాల్సింది కానీ సినిమా టీసర్ భారీ అంచనాల నడుమ రిలీజ్ అయిన తర్వాత అందరి అంచనాలను తప్పింది….

భారీ ట్రోల్స్ ని ఫేస్ చేసిన ఈ సినిమా టీసర్ కి వచ్చిన ఈ కంప్లీట్ నెగటివ్ రెస్పాన్స్ ఇంపాక్ట్ తో సంక్రాంతి నుండి తప్పుకుని ఏకంగా 6 నెలలు పోస్ట్ పోన్ అవ్వాల్సి వచ్చింది. అంతలా 6 నెలలు పోస్ట్ పోన్ అయిందంటే ఏ రేంజ్ లో సినిమాకి…

ట్రోల్స్ ఇంపాక్ట్ చూపాయో అర్ధం చేసుకోవచ్చు. కానీ ఇంతటి ట్రోల్స్ ని ఫేస్ చేసినా కానీ ఈ టీసర్ కి ఇప్పుడు భారీ రికార్డ్ దక్కింది, హిందీ లో భారీ రీచ్ ను సొంతం చేసుకున్న ఈ టీసర్ కి ఏకంగా అక్కడ 100 మిలియన్స్ కి పైగా వ్యూస్ సొంతం అయ్యి సంచలనం సృష్టించింది ఇప్పుడు.

అక్కడ ఓవరాల్ గా రిలీజ్ అయిన టీసర్ లో 100 మిలియన్స్ ని అందుకుని సంచలనం సృష్టించగా అది కూడా ఈ రేంజ్ నెగిటివిటీని ఫేస్ చేసి ట్రోల్స్ ని తట్టుకుని ఇలాంటి వ్యూవర్ షిప్ ను దక్కించుకోవడం అరాచకం అనే చెప్పాలి. ఇక ఈ గ్యాప్ లో డైరెక్టర్ అందరూ సినిమా ఎలా ఉండాలి అనుకుంటున్నారో అలా తీర్చిదిద్దితే కచ్చితంగా సంచలనాలు సృష్టించే అవకాశం ఉంటుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here