Home న్యూస్ సోలో బ్రతుకే సో బెటర్ బుకింగ్స్ కి షాకింగ్ రెస్పాన్స్!

సోలో బ్రతుకే సో బెటర్ బుకింగ్స్ కి షాకింగ్ రెస్పాన్స్!

0

మెగా మేనల్లుడు సాయి ధరం తేజ్ నబా నటేష్ ల కాంబినేషన్ లో రూపొందుతున్న లేటెస్ట్ మూవీ సోలో బ్రతుకే సో బెటర్ సినిమా ఎట్టకేలకు పాండమిక్ తర్వాత థియేటర్స్ లో జనాలను రప్పించడానికి సిద్ధం అవుతున్న మొట్ట మొదటి నోటబుల్ మూవీ గా రావడానికి సిద్ధం అవుతుంది, సినిమా 25 న గ్రాండ్ గా రెండు తెలుగు రాష్ట్రాలలో రిలీజ్ కానుండగా సినిమా అడ్వాన్స్ బుకింగ్స్ ని ఆల్ రెడీ మొదలు పెట్టారు.

సెలెక్టివ్ ప్లేసెస్ లో మొదలైన సినిమా అడ్వాన్స్ బుకింగ్స్ కి షాకింగ్ అనిపించే విధంగా కొన్ని చోట్ల పాజిటివ్ అండ్ కొన్ని చోట్ల యావరేజ్ బుకింగ్స్ జరుగుతున్నాయి. హైదరాబాదు లో మాత్రం సినిమా మొదటి రోజు మార్నింగ్ షో లకు సంభందించిన బుకింగ్స్ సాలిడ్ గా జరిగాయి అని చెప్పాలి.

మిగిలిన చోట్ల ముఖ్యంగా రూరల్ ఏరియాలలో థియేటర్స్ ఒక్కొటిగా లేట్ గా ఓపెన్ అవుతూ ఉండగా బుకింగ్స్ కూడా లేట్ గా ఓపెన్ అవుతూ ఉన్నాయి. వైజాగ్ ఏరియాలో బుకింగ్స్ కి మంచి రెస్పాన్స్ వస్తుండగా టోటల్ సీడెడ్ లో బుకింగ్స్ ఇంకా జోరు అందుకోవాల్సి ఉంది… ఇక నైజాం ఏరియాలో…

ముందే చెప్పినట్లు హైదరాబాదు లో బుకింగ్స్ కి మంచి రెస్పాన్స్ రాగా మిగిలిన చోట్ల మెయిన్ థియేటర్స్ లో బుకింగ్స్ ఇప్పుడిప్పుడే జోరు స్టార్ట్ అవుతున్నాయి. మొత్తం మీద రిలీజ్ కి ఒక రోజు ముందు వరకు మాత్రం అన్ని చోట్ల పరిస్థితులు సద్దుకుని బెటర్ ఓపెనింగ్స్ ని సినిమా సొంతం చేసుకునే అవకాశం ఎంతైనా ఉందని చెప్పాలి.

ఆల్ మోస్ట్ 8 నెలల తర్వాత థియేటర్స్ రీ ఓపెన్ అవ్వడం తో జనాలు థియేటర్స్ కి రావాలో వద్దో అన్న డౌట్ లోనే ఎక్కువగా ఉన్నారు, కానీ మంచి సినిమా పడితే జనాలు థియేటర్స్ కి రావడం ఖాయం, ఇక సోలో బ్రతుకే సో బెటర్ కి కావాల్సింది అల్లా హిట్ టాక్ అని చెప్పాలి, హిట్ టాక్ వస్తే ఆటోమాటిక్ గా జనాలు థియేటర్స్ కి తరలి వచ్చే అవకాశం ఉంటుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here