Home న్యూస్ 2 కోట్లు అనుకుంటే ఊరమాస్ కలెక్షన్స్…ఫస్ట్ డే వరల్డ్ వైడ్ కలెక్షన్స్ ఇవే!

2 కోట్లు అనుకుంటే ఊరమాస్ కలెక్షన్స్…ఫస్ట్ డే వరల్డ్ వైడ్ కలెక్షన్స్ ఇవే!

0

9 నెలల తర్వాత థియేటర్స్ రీ ఓపెన్ అవ్వగా బాక్స్ ఆఫీస్ దగ్గర జనాలను తిరిగి రప్పించడానికి సిద్ధం అయిన మెగా మేనల్లుడు సాయి ధరం తేజ్ నటించిన లేటెస్ట్ మూవీ సోలో బ్రతుకే సో బెటర్ సినిమా మొదటి రోజు రెండు తెలుగు రాష్ట్రాలలో అంచనాలను మించి కలెక్షన్స్ ని సాధించి దుమ్ము దుమారం చేసింది, సినిమాకి 50% ఆక్యుపెన్సీ లిమిటేషన్లు, చాలా లిమిటెడ్ రిలీజ్ అలాగే పాండమిక్ తర్వాత…

రిలీజ్ అవుతున్న మొదటి సినిమా అవ్వడం తో బాక్స్ ఆఫీస్ దగ్గర ఏం జరుగుతుందో అని అందరూ ఆశగా ఎదురు చూడగా సినిమా మొదటి రోజు చాలా చోట్ల హౌస్ ఫుల్ బోర్డ్స్ పడగా మొత్తం మీద రెండు తెలుగు రాష్ట్రాల్లో 2 కోట్ల రేంజ్ ఓపెనింగ్స్ ని సొంతం చేసుకుంటే సూపర్బ్ అనుకున్నారు.

కానీ సినిమా మొదటి రోజు అంచనాలను మించి పోయి ఏకంగా 2.91 కోట్ల షేర్ ని సొంతం చేసుకుని దుమ్ము దుమారం చేసింది, ఇందులో 21 లక్షల హైర్స్ కూడా ఉన్నప్పటికీ మొత్తం మీద అంచనాలను ఓ రేంజ్ లో మించి దుమ్ము దుమారం చేసింది సోలో బ్రతుకే సో బెటర్ సినిమా…

మొత్తం మీద వరల్డ్ వైడ్ గా సినిమా 3.43 కోట్ల షేర్ ని 5.5 కోట్ల రేంజ్ లో గ్రాస్ కలెక్షన్స్ ని సొంతం చేసుకుని అల్టిమేట్ ఓపెనింగ్స్ ని ప్రస్తుత పరిస్థితులలో సొంతం చేసుకుంది, ఒకసారి ఏరియాల వారి కలెక్షన్స్ ని గమనిస్తే..
👉Nizam: 1.04Cr(6L hires)
👉Ceeded: 52L
👉UA: 40L(10L hires)
👉East: 26L
👉West: 18L
👉Guntur: 22L
👉Krishna: 13L
👉Nellore: 16L(5L hires)
AP-TG Total:- 2.91CR{21L hires}(4.7Cr+ Gross)
KA+ROI: 32L
Os: 20L
Total WW: 3.43Cr(5.5Cr+ Gross)

ఇక సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర టోటల్ వరల్డ్ వైడ్ గా 9.2 కోట్ల ప్రీ రిలీజ్ ని సొంతం చేసుకోగా బ్రేక్ ఈవెన్ అవ్వడానికి 9.6 కోట్ల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకోవాల్సి ఉంటుంది. అంటే మరో 6.17 కోట్ల షేర్ ని సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర సొంతం చేసుకుంటే క్లీన్ హిట్ అవుతుంది, ఇక వీకెండ్ పూర్తీ అయ్యే టైం కి సినిమా జోరు ఇలానే చూపే అవకాశం ఎంతైనా ఉందని చెప్పాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here