సెకెండ్ వేవ్ ఎఫెక్ట్ వలన రిలీజ్ కి సిద్ధంగా ఉన్న అనేక సినిమాలు థియేటర్స్ లో బరిలోకి దిగాలి అనుకుంటున్నా పరిస్థితులు ఇంకా నార్మల్ అవ్వడం లేదు. ఇంకొంచం టైం పట్టేలా ఉండగా ఒకసారి పరిస్థితులు సెట్ అయితే ఇక సోలో రిలీజ్ లు అందరికీ దొరకడం అన్నది చాలా కష్టమే అని చెప్పాలి. ఇక పండగల టైం లో అయితే పోటి తప్పకుండా ఉండటం ఖాయం. ఈ లోపు థార్డ్ వేవ్ రాకుండా ఉంటే…
ఆడియన్స్ థియేటర్స్ లో చాలా సినిమాలను చూసే అవకాశం ఉంటుంది. టాలీవుడ్ లో బిగ్గెస్ట్ సీజన్ గా చెప్పుకునే సంక్రాంతి సీజన్ లో ఈ సారి పోటి ఉన్నా మార్కెట్ లాస్ట్ ఇయర్ తో పోల్చితే తక్కువే జరిగింది, కానీ వచ్చే సంక్రాంతి మాత్రం టాలీవుడ్ చరిత్రలోనే…
నిలిచిపోయే విధంగా జరిగే అవకాశం కనిపిస్తుంది. ముందే చెప్పినట్లు ఎలాంటి థార్డ్ వేవ్ ఎఫెక్ట్ లేకుండా ఉంటే వచ్చే ఏడాది సంక్రాంతి పోటి చరిత్రలో నిలుస్తుంది. మహేష్ బాబు సర్కారు వారి పాట, పవన్ కళ్యాణ్ రానాల మల్టీ స్టారర్ మూవీ, ప్రభాస్ రాధేశ్యామ్ సినిమాలతో పాటు.
వెంకటేష్ వరుణ్ తేజ్ ల ఎఫ్ 3 సినిమాలు సంక్రాంతికి రిలీజ్ అవుతున్నట్లు కన్ఫాం చేశాయి. ఆల్ మోస్ట్ 3 టాప్ హీరోలు ఒక సీనియర్ హీరో ఇద్దరు మీడియం రేంజ్ హీరోలు ఓవరాల్ గా ఈ పోటిలో ఇప్పుడు ఇన్వాల్వ్ అవుతున్నారు. ఇది ఆల్ టైం ఎపిక్ బిగ్గెస్ట్ క్లాష్ అని చెప్పాలి. ఇది వరకు 2001 టైం లో టాలీవుడ్ టాప్ స్టార్స్ చిరంజీవి మృగరాజు…
బాలయ్య నరసింహా నాయుడు మరియు వెంకటేష్ దేవి పుత్రుడు సినిమాలు పోటి పడ్డాయి. ఆ పోటి తర్వాత మళ్ళీ ఇలా ఇంతమంది స్టార్స్ ఒక్క సీజన్ లో పోటి పడటం 20 ఏళ్లలో ఇదే తొలిసారి కాబోతుంది. మరి లాస్ట్ మినట్ లో ఏమైనా మార్పులు ఉంటాయా లేక ఈ పోటినే కన్ఫాం అవుతుందా అన్నది ఆసక్తి కారం. పోటి ఉంటే మట్టుకు వచ్చే సంక్రాంతి చరిత్రలో నిలిచిపోతుంది.