Home న్యూస్ 7 ఏళ్ల తర్వాత తెలుగు సినిమా చేస్తున్న సిద్ధార్థ్…శర్వానంద్ మహా సముద్రంలో…!!

7 ఏళ్ల తర్వాత తెలుగు సినిమా చేస్తున్న సిద్ధార్థ్…శర్వానంద్ మహా సముద్రంలో…!!

0

సిద్ధార్థ్ అవడానికి తమిళ్ హీరోనే అయినా కెరీర్ బెస్ట్ పీక్ టైం ని ఎంజాయ్ చేసింది తెలుగు లోనే….నువ్వు వస్తానంటే నేను వద్దంటానా సినిమా తో టాలీవుడ్ లో అడుగు పెట్టి బ్లాక్ బస్టర్ కొట్టగా తర్వాత బొమ్మరిల్లు తో ఆల్ టైం బ్లాక్ బస్టర్ అందుకున్నాడు, తర్వాత ఆట, కొంచం ఇష్టం కొంచం కష్టం లాంటి హిట్ మూవీస్ చేసిన సిద్ధార్థ్ తర్వాత ఫ్లాఫ్స్ ఎక్కువగా పడటం తో…

జబర్దస్త్ సినిమాను 2013 లో రిలీజ్ చేసిన తర్వాత తెలుగు సినిమాను వదిలేసి తమిళ్ లోనే సెటిల్ అయ్యాడు, అప్పుడప్పుడు సిద్ధార్థ్ నటించిన తమిళ్ మూవీస్ తెలుగు లో డబ్ అవుతూ రిలీజ్ అయ్యేవి కానీ వాటిని పెద్దగా ఎవరూ పట్టించుకోలేదు. తమిళ్ లో అడపాదడపా హిట్స్ పడ్డా అవి తెలుగు లో…

పడ్డ రేంజ్ తో పోల్చితే తక్కువే అని చెప్పాలి… రీసెంట్ టైం లో పెద్దగా ఫామ్ లో లేని సిద్ధార్థ్ దాదాపు 7 ఏళ్ల గ్యాప్ తర్వాత డైరెక్ట్ తెలుగు సినిమా ను ఒప్పుకున్నాడు, RX100 తో టాలీవుడ్ లో బ్లాక్ బస్టర్ ఎంట్రీ ఇచ్చిన డైరెక్టర్ అజయ్ భూపతి తన తర్వాత సినిమా ను…

మొదలు పెట్టడానికి రెండేళ్ళ టైం తీసుకోగా టాలెంటెడ్ యాక్టర్ శర్వానంద్ తో మహా సముద్రం సినిమాను రీసెంట్ గా అనౌన్స్ చేయగా ఇప్పుడు సినిమాలో మరో లీడ్ రోల్ లో సిద్ధార్థ్ ని తీసుకున్నారు, ఈ విషయాన్ని అఫీషియల్ గా అనౌన్స్ చేయగా 7 ఏళ్ల తర్వాత టాలీవుడ్ లో రీ ఎంట్రీ ఇవ్వబోతున్నాడు సిద్ధార్థ్.

తెలుగు తో పాటు తమిళ్ లో ఏక కాలంలో రూపొందబోతున్న ఈ సినిమాను ఏ కే ఎంటర్టైన్మెంట్స్ వారు నిర్మిస్తుండగా సినిమా రెగ్యులర్ షూటింగ్ త్వరలో మొదలు కాబోతుందని సమచారం… శర్వానంద్ కూడా ప్రస్తుతం ఫ్లాఫ్స్ లోనే ఉండగా ఈ ఇద్దరు హీరోలు కంబ్యాక్ బాక్స్ ఆఫీస్ దగ్గర ఎంత సాలిడ్ గా ఉంటుంది అన్నది ఇప్పుడు ఆసక్తిగా మారింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here