తెలుగు లో అంటే టాప్ హీరోలు మనకు లెక్కకు మిక్కిలి ఉండటం విశేషం కానీ తమిళ్ లో మాత్రం అలా కాదు, రజినీ కమల్ లు సీనియర్స్ అవ్వగా అక్కడ ప్రజెంట్ టాప్ హీరోలు అంటే విజయ్ అజిత్ కుమార్ లే అని చెప్పాలి. విజయ్ వరుస పెట్టి సినిమాలు చేస్తూ బాక్స్ ఆఫీస్ దగ్గర ప్రస్తుతం కోలివుడ్ లో ఎవ్వరూ టచ్ చేయలేని స్టార్ డం ని సొంతం చేసుకోగా అజిత్ కుమార్ కి…
కూడా అలాంటి క్రేజ్ ఉన్నప్పటికీ ఎంచుకునే సినిమాలు డిఫెరెంట్ గా ఉంటూ రావడం అవి ఆడియన్స్ ముందుకు రావడానికి చాలా టైం పట్టడం లాంటివి ఎఫెక్ట్ చూపుతున్నాయి. 2019 లో విశ్వాసం సినిమాతో సంచలన విజయాన్ని నమోదు చేసిన అజిత్ తర్వాత ఇప్పటి వరకు కొత్త సినిమాను…
రిలీజ్ చేయలేదు సరికదా ఆ సినిమా ఫస్ట్ లుక్ కూడా ఆడియన్స్ ముందుకు రాలేదు. వలిమై అనే పేరుతో రూపొందుతున్న ఈ సినిమా ఫస్ట్ లుక్ కూడా ఇంకా రివీల్ అవ్వలేదు కానీ సినిమా బిజినెస్ మాత్రం సూపర్ సాలిడ్ గా జరుగుతుందని సమాచారం. సెకెండ్ వేవ్ తర్వాత సెకెండ్ ఆఫ్ లో…
ఆడియన్స్ ముందుకు రాబోతున్న ఈ సినిమా తమిళనాడు లో బిజినెస్ ను ఇప్పటికే కంప్లీట్ చేసుకుందని సమాచారం. తమిళనాడు లో ఈ సినిమా 65 కోట్ల భారీ రేటు ని సొంతం చేసుకుందని అంటున్నారు. తమిళనాడు లో ఇది వన్ ఆఫ్ డి హైయెస్ట్ ప్రీ రిలీజ్ బిజినెస్ లలో ఒకటి అంటూ ఉండటం విశేషం అనే చెప్పాలి. ఫస్ట్ లుక్ కూడా రివీల్ చేయకుండానే…
ఈ రేంజ్ లో క్రేజ్ ను సొంతం చేసుకుని అల్టిమేట్ బిజినెస్ ను దక్కించుకున్న ఈ సినిమా కచ్చితంగా బాక్స్ ఆఫీస్ దగ్గర అజిత్ కి విశ్వాసం కి మించే రేంజ్ విజయాన్ని ఇస్తుందని ఫ్యాన్స్ ఆశిస్తున్నారు. మరి ఈ సినిమా ఫస్ట్ లుక్ వచ్చిన తర్వాత ఇంకెలాంటి రచ్చ చేస్తుందో చూడాలి. అన్నీ అనుకున్నట్లు జరిగితే దీపావళి టైం కి ఈ సినిమా ఆడియన్స్ ముందుకు వస్తుందని అంటున్నారు.