Home న్యూస్ అజిత్ వలిమై తెలుగు బిజినెస్…ఇక్కడ హిట్ అవ్వాలి అంటే ఎంత కావాలి!!

అజిత్ వలిమై తెలుగు బిజినెస్…ఇక్కడ హిట్ అవ్వాలి అంటే ఎంత కావాలి!!

0

కోలివుడ్ టాప్ హీరోలలో ఒకరైన స్టార్ హీరో అజిత్ కుమార్ నటించిన లేటెస్ట్ మూవీ వలిమై…. బాక్స్ ఆఫీస్ దగ్గర సినిమా సంక్రాంతి బరిలో నిలవాల్సిన ఈ సినిమా థార్డ్ వేవ్ ఇంపాక్ట్ వలన సినిమా పోస్ట్ పోన్ అవ్వగా సినిమాను ఫిబ్రవరి 24 న రిలీజ్ చేయాలనీ ఫిక్స్ చేయగా భారీగా అన్ని చోట్లా రిలీజ్ ను ప్లాన్ చేయగా తెలుగు లో కూడా భారీగా రిలీజ్ ప్లాన్ చేశారు కానీ…

25న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ భీమ్లా నాయక్ సినిమా రిలీజ్ కన్ఫాం అవ్వడంతో ఈ సినిమా కి ఇక్కడ ఇది గట్టి ఎదురు దెబ్బగా మారింది అనే చెప్పాలి. అయినా కానీ ఒక రోజు ఫ్రీ రన్ ఉన్న నేపధ్యంలో ఎంత కలెక్షన్స్ వస్తే అంతా మొదటి రోజు సొంతం….

చేసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పాలి. కాగా ముందు భీమ్లా నాయక్ కన్ఫాం అవ్వని టైం లో సినిమా తెలుగు రైట్స్ ని 4 కోట్ల రేటు కి అమ్మారు…. కానీ భీమ్లా నాయక్ రిలీజ్ కన్ఫాం చేసుకోవడం తో వలిమై సినిమా కి ఇక్కడ బిజినెస్ కొద్ది వరకు తగ్గింది అని చెప్పాలి.

మొత్తం మీద వలిమై సినిమా తెలుగు బిజినెస్ ను గమనిస్తే…. నైజాం ఏరియా లో సినిమా కోటి రేంజ్ లో బిజినెస్ ను సొంతం చేసుకున్న వలిమై సినిమా సీడెడ్ ఏరియా లో సినిమా 40 లక్షల దాకా షేర్ ని సినిమా సొంతం చేసుకుంది. ఇక ఆంధ్ర రీజన్ లో సినిమా 1.1 కోట్ల బిజినెస్ ను సొంతం చేసుకుంది. దాంతో సినిమా మొత్తం మీద సినిమా….

తెలుగు రాష్ట్రాలలో 2.50 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ ను సొంతం చేసుకోగా సినిమా ఇప్పుడు బాక్స్ ఆఫీస్ దగ్గర ఇప్పుడు 2.70 కోట్లకు పైగా కలెక్షన్స్ ని సొంతం చేసుకుంటే క్లీన్ హిట్ గా నిలుస్తుంది అని చెప్పాలి. ఇక తమిళ్ వర్షన్ బిజినెస్ లెక్క వివరాలు ఇంకా రివీల్ అవ్వాల్సి ఉంది, ఇక బాక్స్ ఆఫీస్ దగ్గర సినిమా ఓవరాల్ గా ఎలాంటి ఓపెనింగ్స్ ని కలెక్షన్స్ ని సొంతం చేసుకుంటుందో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here