ఫస్ట్ మూవీ తో నే సెన్సేషనల్ ఎంట్రీ ఇవ్వడం చాలా కొద్ది మందికి మాత్రమే సాధ్యం అవుతుంది, టాలీవుడ్ లో ఇలాంటి రికార్డ్ అందుకున్న అతి కొద్ది మందిలో అక్కినేని అఖిల్ కూడా ఒకరు, కెరీర్ లో మొట్ట మొదటి సినిమా తోనే సెన్సేషనల్ ఎంట్రీ ఇచ్చినప్పటికీ ఆ సినిమా ఓపెనింగ్స్ కి తగ్గ టాక్ రాక పోవడం తో ఫైనల్ రన్ లో డిసాస్టర్ అయినా డెబ్యు మూవీ బిగ్గెస్ట్ ఓపెనింగ్స్….
అందుకున్న హీరోగా అఖిల్ రికార్డ్ సృష్టించాడు, కానీ తర్వాత చేసిన హలో అండ్ మిస్టర్ మజ్ను సినిమా లు కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర నిరాశ పరచగా నికార్సయిన హిట్ కోసం ఎదురు చూస్తున్న అఖిల్ రీసెంట్ టైం లో అపజయం అంటే తెలియని బ్యానర్ అయిన…
గీత ఆర్ట్స్ ఒప్పుకున్నా సినిమా మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్, బొమ్మరిల్లు పరుగు తర్వాత ఫేడ్ అవుట్ అయిన బొమ్మరిల్లు భాస్కర్ డైరెక్షన్ లో పూజా హెడ్గే హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమా లాక్ డౌన్ సమయానికి 75% వరకు షూటింగ్ ని కంప్లీట్ చేసుకుంది. లాక్ డౌన్ లేకుండా ఉంటే ఈ పాటికే రిలీజ్ కూడా అయ్యేది.
కానీ పరిస్థితులు మారడం తో ఇప్పుడు దసరా ని టార్గెట్ చేస్తున్న ఈ సినిమా 75% కంప్లీట్ అయిన నేపధ్యంలో టీం అందరూ లాక్ డౌన్ వలన ఖాళీగా నే ఉండటం తో రీసెంట్ గా ఈ సినిమా రషెస్ ని చూడటానికి నాగార్జున ని పిలవడం జరిగిందట. టోటల్ రషెస్ చూసిన నాగార్జున చాలా వరకు ఇంప్రెస్ అయినా కానీ…
అక్కడక్కడా కొన్ని మార్పులు చేస్తే మరింత బాగుటుందని బొమ్మరిల్లు భాస్కర్ కి సూచించారట. దానికి భాస్కర్ కూడా ఒప్పుకుని లాక్ డౌన్ తర్వాత ఆ మార్పులు చేస్తామని చెప్పారని టాక్ ఉంది. మరి ఈ సినిమా తో అయినా అఖిల్ బాక్స్ ఆఫీస్ దగ్గర నికార్సయిన హిట్ అందుకుని దుమ్ము లేపుతాడో లేదో చూడాలి..