బాక్స్ ఆఫీస్ దగ్గర 3 సినిమాలు చేసినా నికార్సయిన హిట్ కోసం ఎదురు చూస్తున్న అఖిల్ అక్కినేని ప్రస్తుతం మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ తో ఆ హిట్ ని అందుకోవడం ఖాయమని అంతా భావిస్తున్నారు. వచ్చే ఇయర్ సంక్రాంతి రేసు లో ఎంటర్ అవ్వబోతున్న ఈ సినిమా తో కెరీర్ లో తొలి బాక్స్ ఆఫీస్ హిట్ ఖాయం అన్న నమ్మకంతో ఉండగా తర్వాత సినిమా పై మాత్రం అనేక రూమర్స్ ఉన్నాయి.
చాలా మంది డైరెక్టర్స్ తో అఖిల్ సినిమాలు అనుకున్నా కానీ ఎవ్వరితో కూడా సినిమా ఫైనల్ అవ్వలేదు, లేటెస్ట్ గా అనిల్ రావిపూడి తో సినిమా అనుకున్నా కానీ అనిల్ ప్లాన్స్ అఖిల్ కి నచ్చలేదని టాక్ వినిపిస్తుంది, దాంతో ఇప్పుడు అనిల్ ప్లేస్ లో ఇది వరకు…
స్టొరీ చెప్పిన మాస్ అండ్ స్టైలిష్ డైరెక్టర్ సురేందర్ రెడ్డి తో అఖిల్ సినిమా ఆల్ మోస్ట్ కన్ఫాం అయినట్లే అని అంటున్నారు. ఈ ప్రాజెక్ట్ ని మైత్రి మూవీ మేకర్స్ నిర్మించబోతున్నారు అన్నది లేటెస్ట్ టాక్. సురేందర్ రెడ్డి మంచి టాలెంట్ ఉన్న డైరెక్టర్ అన్న విషయం అందరికీ తెలిసిందే.
రీసెంట్ లో ఒక్క కిక్ 2 సినిమా తప్పితే అన్ని సినిమాలు బాగానే ఆడియన్స్ కి రీచ్ అయ్యాయి, సైరా భారీ పాజిటివ్ టాక్ తెచ్చుకున్నా సినిమా జానర్ వల్ల ఫ్లాఫ్ అయ్యింది. దాంతో సురేందర్ రెడ్డి తర్వాత సినిమా కి బ్రేక్స్ పడగా టాప్ స్టార్స్ తో సినిమాలు అనుకున్నా కానీ సెట్ అవ్వలేదు. ఇలాంటి టైం లో అఖిల్ తో మూవీ…
ఇప్పుడు ఆల్ మోస్ట్ కన్ఫాం అనే అంటున్నారు కాబట్టి తన స్టైల్ లో ఓ స్టైలిష్ ఎంటర్ టైనర్ ని తీయాలి అని సురేందర్ రెడ్డి భావిస్తున్నాడట. మరి ఫైనల్ గా ఈ ప్రాజెక్ట్ అయినా కన్ఫాం అవుతుందా లేక మరో కొత్త ప్రాజెక్ట్ తెరపైకి వస్తుందా అన్నది త్వరలో తేలనుంది…