Home న్యూస్ అక్షయ్ కుమార్ స్కై ఫోర్స్ సినిమా ఎలా ఉంది…హిట్టా-ఫట్టా!!

అక్షయ్ కుమార్ స్కై ఫోర్స్ సినిమా ఎలా ఉంది…హిట్టా-ఫట్టా!!

0

బాలీవుడ్ ఖిలాడీ అక్షయ్ కుమార్ వరుస సినిమాలతో ఎప్పటి కప్పుడు ఆడియన్స్ ముందుకు వస్తూనే ఉంటాడు….లేటెస్ట్ గా అక్షయ్ కుమార్ నటించిన స్కై ఫోర్స్ సినిమా రిపబ్లిక్ డే వీకెండ్ లో ఆడియన్స్ ముందుకు వచ్చేసింది….ఈ సినిమాతో బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి కంబ్యాక్ ను సొంతం చేసుకుంటానని నమ్మకంతో ఉన్న అక్షయ్ కుమార్ ఆశలు నిజం అయ్యాయో లేదో తెలుసుకుందాం పదండీ..

కథ పాయింట్ కి వస్తే ఇండియా పాకిస్థాన్ ల మధ్య 1965 టైంలో జరిగిన యుద్ధం నేపధ్యంలో సినిమా కథ ఉంటుంది….యుద్ధంలో జరిగిన సంఘటనలు….వింగ్ కమాండర్ గా హీరో చేసిన చర్యలు ఏంటి అనేది సినిమా ఓవరాల్ స్టోరీ పాయింట్…బాలీవుడ్ లో ఇండియా పాకిస్థాన్ యుద్ధాల మీద..

సినిమాలు ఎప్పటి కప్పుడు వస్తూనే ఉండగా ఒక దశ దాటాక వీటి మీద ఆడియన్స్ లో ఇంటరెస్ట్ పూర్తిగా తగ్గిపోయింది….మళ్ళీ అదే పాయింట్ తో వచ్చిన స్కై ఫోర్స్ సినిమాలో ఎమోషనల్ కంటెంట్ బాగానే వర్కౌట్ అయినట్లు అనిపించినా కూడా ఓవరాల్ గా సినిమాలా చూసుకుంటే..

రియల్ ఇంసిడెంట్ ల నేపధ్యంలో తెరకెక్కిన సినిమానే అయినా కూడా కథ ఫ్లాట్ గా ఈజీగా తర్వాత సీన్ ఏమవుతుందో అన్నది తెలిసిపోతూ ఉంటుంది. కొన్ని సీన్స్ బాగా వచ్చాయి, అక్షయ్ కుమార్ రీసెంట్ మూవీస్ మీద బెటర్ కంటెంట్ తో సినిమా ఉన్నప్పటికీ…

ఒకప్పటి అక్షయ్ కుమార్ ఫామ్ ని మ్యాచ్ చేసేలా అయితే సినిమా పూర్తిగా ఆకట్టుకోలేక పోయింది…అలాగే గ్రాఫిక్స్ కూడా అంత క్వాలిటీగా ఏమి అనిపించలేదు…ప్రొడక్షన్ వాల్యూస్ ఇంకా బాగా ఉండాల్సింది….

అక్షయ్ కు తోడుగా సినిమాలో హీరోగా పరిచయం అయిన వీర్ పహారియా పర్వాలేదు అనిపించగా…హీరోయిన్స్ నిర్మత్ కోర్, సారా అలీ ఖాన్ లు పర్వాలేదు అనిపించారు. ఫస్టాఫ్ కొంచం పడుతూ లేస్తూ సాగినా కూడా సెకెండ్ ఆఫ్ లో కొన్ని కీలక సన్నివేశాలు బాగానే ఆకట్టుకున్నాయి…

ఓవరాల్ గా సినిమా అక్షయ్ కుమార్ రీసెంట్ మూవీస్ మీద బెటర్ గా అనిపించినా మొత్తం మీద యావరేజ్ టు ఎబో యావరేజ్ లెవల్ లో సినిమాగా అనిపించింది…వీకెండ్ లో చూడటానికి పెద్దగా సినిమాలు ఏమి లేక పోతే ఒకసారి ఈ సినిమాను చూడొచ్చు. 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here