Home గాసిప్స్ 145 కోట్ల సినిమా డిసాస్టర్….సగం రెమ్యునరేషన్ రిటర్న్ ఇవ్వనున్న హీరో!!

145 కోట్ల సినిమా డిసాస్టర్….సగం రెమ్యునరేషన్ రిటర్న్ ఇవ్వనున్న హీరో!!

0

బాక్స్ ఆఫీస్ దగ్గర హిట్స్ ఫ్లాఫ్స్ అనేవి ఎవ్వరూ ఊహించరు అని చెప్పాలి, కొన్ని సార్లు అంచనాలు పెట్టుకున్న సినిమాలు నిరాశ ని మిగిలించడం, కొన్ని సార్లు అంచనాలు లేని సినిమాలు బాక్స్ ఆఫీస్ దగ్గర దుమ్ము లేపడం జరుగుతూ ఉంటుంది కానీ పెద్ద హీరోల సినిమాలకు ఎప్పుడూ మంచి బజ్ ఉంటుంది కానీ రీసెంట్ టైంలో వరుస ఫ్లాఫ్స్ ను ఫేస్ చేస్తున్న హీరో అక్షయ్ కుమార్ నటించిన లేటెస్ట్ మూవీ…

సెల్ఫీ బాక్స్ ఆఫీస్ దగ్గర బొక్క బోర్లా పడగా ఏ దశలో కూడా సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ఇంపాక్ట్ ని చూపించలేక ఎపిక్ డిసాస్టర్ గా నిలిచింది. ఆల్ మోస్ట్ 145 కోట్ల రేంజ్ బడ్జెట్ తో రూపొందిన ఈ సినిమా పట్టుమని 20 కోట్లు కూడా సాధించలేక పోయింది. దాంతో ఎపిక్ డిసాస్టర్ గా…

నిలిచిన ఈ సినిమా రిజల్ట్ తో హీరో తను తీసుకున్న రెమ్యునరేషన్ నుండి సగానికి పైగా అమౌంట్ ని ఇప్పుడు నిర్మాతకి ఇవ్వబోతున్నాడు అన్న టాక్ బాలీవుడ్ లో వినిపిస్తుంది. ప్రతీ సినిమాకి యావరేజ్ గా 100 కోట్ల రేంజ్ లో రెమ్యునరేషన్ ని తీసుకునే అక్షయ్ కుమార్ ఈ సినిమాకి కూడా..

అంతే రెమ్యునరేషన్ తీసుకోగా ఆల్ మోస్ట్ ఇప్పుడు అందులో సగానికి పైగా రిటర్న్ ఇవ్వబోతున్నాడట. నిర్మాతకి నాన్ థియేట్రికల్ రైట్స్ తో వచ్చిన అమౌంట్ మీద హీరో ఇచ్చే రిటర్న్ అమౌంట్ తో నష్టాలు అయితే పెద్దగా ఉండక పోవచ్చు అని అంటున్నారు ఇప్పుడు. ఇక అక్షయ్ కుమార్ బాక్స్ ఆఫీస్ దగ్గర ఎప్పుడు కంబ్యాక్ ఇస్తాడో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here