ఈ ఇయర్ సంక్రాంతి బరిలో ఎవ్వరూ ఊహించని విధంగా లాస్ట్ మినట్ లో రిలీజ్ ను కన్ఫాం చేసుకుని ఇతర సినిమాల థియేటర్స్ ని దక్కించుకుని అంచనాలను అందుకోలేక బాక్స్ ఆఫీస్ దగ్గర సంక్రాంతి సెలవులను సైతం ఏమాత్రం ఆశించిన విధంగా వాడుకోలేక పోయిన సినిమా బెల్లం కొండ శ్రీనివాస్ నటించిన అల్లుడు అదుర్స్ సినిమా. కందిరీగ సీక్వెల్ అంటూ హడావుడి చేసి ఆడియన్స్ ముందుకు వచ్చిన ఈ సినిమా లో…
అందరి ఓవర్ యాక్షన్ లు చూసి ఆడియన్స్ కూడా ఇదేం సినిమా రా బాబు అనుకున్నారు. సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర 9.8 కోట్ల టార్గెట్ తో బరిలోకి దిగగా మొత్తం మీద పరుగు పూర్తీ అయ్యే టైం కి 7.78 కోట్ల షేర్ ని సాధించి ఫ్లాఫ్ గా నిలిచింది. ఇక తర్వాత…
సినిమా శాటిలైట్ రైట్స్ కింద 3.5 కోట్ల దాకా రేటు ని సొంతం చేసుకుంది. థియేటర్స్ లో ఎవ్వరూ చూడలేదు కాబట్టి టెలివిజన్ లో కూడా పెద్దగా ఎవ్వరూ పట్టించుకోరులే అనుకుంటే ఫస్ట్ టైం టెలికాస్ట్ కి సినిమా 6.92 రేటింగ్ ను సొంతం చేసుకుని రేటు కి మంచి ప్రదర్శననే ఇచ్చింది.
ఇక రీసెంట్ గా రెండో సారి కూడా టెలికాస్ట్ అయిన ఈ సినిమా ఈ సారి కచ్చితంగా దెబ్బ పడటం ఖాయం అని అనుకుంటే రెండో సారి కూడా డీసెంట్ గా హోల్డ్ చేసిన ఈ సినిమా 4.52 రేటింగ్ ను సొంతం చేసుకుని అందరికీ షాకిచ్చింది. డిసాస్టర్ రేటింగ్ కన్ఫాం అనుకున్న రెండు సార్లు మంచి రేటింగ్ లతో హోల్డ్ చేసింది ఈ సినిమా…
ఇక్కడ మరో షాకింగా అనిపించే న్యూస్ ఏంటంటే… ఛానెల్ పెట్టిన 3.5 కోట్ల రేటు ఇప్పుడు రెండో సారి టెలికాస్ట్ తో క్లియర్ అయ్యింది. ఇక మూడో సారి నుండి సినిమా ద్వారా ఛానెల్ కి ప్రాఫిట్ రావడం ఖాయమని చెప్పొచ్చు, సినిమా అన్ని చోట్ల దెబ్బ పడినా ఛానెల్ కి మాత్రం దెబ్బ పడకుండా పెట్టుబడి రికవరీ చేయడం విశేషం…